Begin typing your search above and press return to search.
బాహుబలైనా.. పెళ్లిచూపులు అయినా ఒకటే
By: Tupaki Desk | 26 July 2016 9:30 AM GMTఒక సినిమా విడుదలయ్యాక బాగుంటే దాని గురించి జనాలు మాట్లాడుకోవడం.. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ కావడం సహజం. ఐతే కొన్ని రోజులుగా టాలీవుడ్లో ఇంకా విడుదల కాని ఓ చిన్న సినిమా గురించి అందరూ చాలా పాజిటివ్ గా మాట్లాడుకుంటున్నారు. అదే.. పెళ్లిచూపులు. తరుణ్ భాస్కర్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమాలో ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ విజయ్ దేవరకొండ..రీతూ వర్మ జంటగా నటించారు. ఇప్పటికే ఇండస్ట్రీలోని చాలామంది ప్రముఖులు.. మీడియా వాళ్లు ఈ సినిమా చూసి మెచ్చుకున్నారు. స్యూర్ షాట్ హిట్ అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి చాలా సంతోషంగా మీడియాతో మాట్లాడారు.
షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో పెద్దగా పేరులేని హీరో హీరోయిన్లను పెట్టి సినిమా తీశారు రిస్క్ అనిపించలేదా అని ఆయన్ని అడిగితే.. ‘‘చాలామంది ఈ విషయంలో నన్ను భయపెట్టారు. కొత్త వాళ్లతో సినిమా చేస్తున్నావ్.. అది కూడా రూ.2 కోట్లు బడ్జెట్ పెడుతున్నావ్.. ఏంటి అంత నమ్మకం అని అడిగారు. చాలామంది నన్ను వెనక్కి లాగే.. డిజప్పాయింట్ చేసేలా మాట్లాడారు. ఐతే ఎవరేమన్నా నాకు కథ మీద నమ్మకం ఉంది. బాహుబలి అయినా అదే రెండున్నర గంటల్లో చూపించాలి. టికెట్ రేటు అంతే ఉంటుంది. పెళ్లి చూపులు అయినా అదే రెండున్నర గంటల్లో చూపించాలి. దీనికీ అంతే టికెట్. ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాలో హీరో ఎవరు అని చూడటం లేదు. కంటెంట్ ఉందా లేదా అని మాత్రమే చూస్తున్నారు. ఆ ధైర్యంతోనే ఈ సినిమాని నిర్మించాను. ఒక మంచి సినిమా తీశాననే తృప్తి ఉంది’’ అని రాజ్ కందుకూరి అన్నారు.
సురేష్ బాబు లాంటి పెద్ద నిర్మాత ఈ ప్రాజెక్టులో భాగస్వామి కావడం గురించి మాట్లాడుతూ.. ‘‘ముందు సురేష్ గారి దగ్గరికే ఈ కథ వెళ్లింది. ఆయన నా దగ్గరికి పంపించారు. మీరే చేయకుండా నాకెందుకు చెప్పారని అడిగాను. ప్రస్తుతం తాను సినిమాలు నిర్మించట్లేదని.. వేరే ప్రాజెక్టుల్లో భిజీగా ఉన్నాని.. నేను సినిమా తీస్తే సపోర్ట్ చేస్తానని చెప్పారు. ఆయన అందించిన సహకారాన్ని ఎప్పటికీ మరిచిపోలేను’’ అని చెప్పారు.