Begin typing your search above and press return to search.
పెళ్లిచూపులు నిర్మాతను లేనిపోని మాటలన్నారట
By: Tupaki Desk | 1 Aug 2016 5:30 PM GMTపెళ్లిచూపులు.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలైందో తెలియదు.. ఎప్పుడు పూర్తయిందో తెలియదు. ఉన్నట్లుండి విడుదులకు సిద్ధమైపోయింది. సినిమా చూసి అందరూ సూపర్ అంటున్నారు. ఐతే ‘పెళ్లిచూపులు’ సినిమాగా మారకముందే స్క్రిప్టు దశలోనే ఆ సబ్జెక్టును.. దర్శకుడు తరుణ్ భాస్కర్ ను నమ్మి పెట్టుబడి పెట్టిన నిర్మాత రాజ్ కందుకూరి. ఓ కొత్త దర్శకుడితో.. పెద్దగా పేరులేని నటీనటులతో రొటీన్ కు భిన్నమైన ఓ సినిమా నిర్మించడానికి గట్స్ ఉండాలి. ఆ గట్స్ చూపించిన రాజ్ కందుకూరిని చాలామంది చాలా మాటలు అన్నారట. కానీ తన మీద నమ్మకంతో ఈ సినిమాను నిర్మించిన ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అంటున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్.
‘‘మా టీమ్ అంతా కొత్తవాళ్లమే. మా మీద నమ్మకంతో ఈ రిస్క్ తీసుకున్న రాజ్ గారిని చాలామంది లేనిపోని మాటలన్నారు. నాకు చాలా భాదనిపించింది. ఆయనకు సారీ కూడా చెప్పాను. అప్పుడాయన నవ్వుతూ ‘తరుణ్.. సినిమా సూపర్ హిట్. గో ఎహెడ్’ అన్నారు. ఒక దశలో భయమేసింది. సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ ఒక దశలో భయమేసింది కూడా. కానీ రాజ్ గారే చాలా సపోర్ట్ చేశారు. సురేష్ బాబు గారు ప్రివ్యూ చూసి ఓకే అన్నాక ధైర్యం వచ్చింది. ఏమాత్రం వర్రీ అవసరం లేదని... సినిమా చాలా బాగుందని... నిశ్చింతగా ఉండమని ఆయన భరోసా ఇచ్చారు. ఆ తర్వాత పెద్ద పెద్ద వాళ్లతో కలిసి ప్రివ్యూ చూసినప్పుడు అనుభవించిన థ్రిల్ అలాంటిలాంటిది కాదు. తెరపై నా పేరు చూసుకున్నపుడు కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేను’’ అని తరుణ్ భాస్కర్ చెప్పాడు.