Begin typing your search above and press return to search.
రాజ్ కుమార్ మరణానికి అతి కసరత్తులే కారణమా..?
By: Tupaki Desk | 30 Oct 2021 5:37 AM GMTకన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం భారతీయ సినీ పరిశ్రమను విషాదంలో నింపింది. ఆయన కన్నడ పరిశ్రమకు చెందిన నటుడే అయినా దేశ వ్యాప్తంగా రాజ్ కుమార్ కు అభిమానులు ఉన్నారు. ఎందుకంటే ఆయన నటించిన సినిమాలో డబ్బింగ్ ద్వారా ఇతర భాషల్లోకి వెళ్లడం ద్వారా ఇతర ఇండస్ట్రీలకు కూడా పరిచయం అయ్యారు. అయితే రాజ్ కుమార్ మరణంపై మీడియాలో రకరకాలుగా చర్చ సాగుతోంది. గుండెపోటుతో మరణించారని కొందరు.. ఎక్కువగా జిమ్ చేయడంతో కార్డియార్డిక్ అరెస్ట్ అయి చనిపోయాడని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో రాజ్ కుమార్ జిమ్ చేసిన కొన్ని వీడియోలు మీడియాలో వస్తున్నాయి.
మానసిక, శారీరక ఆరోగ్యానికి వ్యాయామం తప్పని సరి. ముఖ్యంగా సినీ హీరోలు ఎప్పటికీ ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక్కోసారి జిమ్ చేయడం శృతి మించవచ్చు. అంటే పాత్రకు తగ్గట్లు ఉండాలంటే బాడీ షేప్ కోసం రోజుల తరబడి జిమ్ చేయాల్సిన అవసరం రావచ్చు. అయితే రాజ్ కుమార్ సినిమా కోసం కాకున్నా ఆరోగ్యంగా ఉండేందుకు జిమ్ చేస్తుండేవారని కన్నడ సినీ పరిశ్రమకు చెందిన వారు అంటున్నారు. ఆయన సినిమాలు ఎక్కువగా మాస్ లెవల్లో ఉండడంతో ప్రతీ సినిమాలో రాజ్ కుమార్ యంగ్ హీరోగానే కనిపంచాడు.
46 ఏళ్ల వయసులో రాజ్ కుమార్ మరణించడం బాధాకరం. అయితే రాజ్ కుమార్ ఎక్కువగా జిమ్ చేయడంతోనే మరణించారని వస్తున్న వార్తల నేపథ్యంలో కొందరు జిమ్ సెంటర్ల నిర్వాహకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆరోగ్యం కోసమే జిమ్ చేయాల్సి వస్తున్నప్పుడు.. ఈ యవసులో జిమ్ చేస్తే హార్ట్ ఎటాక్ వస్తుందా..? అనే కొశ్చన్ రేజ్ చేసి చర్చలు జరుపుతున్నారు. అయితే జిమ్ సెంటర్ల నిర్వాహకులు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. జిమ చేయడం వల్ల హార్ట్ ఎటాక్ రావడమనేది అరుదు.. కానీ వయసును భట్టి ఐటమ్స్ చేస్తుండాలని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అంటే యవ్వనంలో ఉన్న సమయంలో కసరత్తులు ఎక్కువ చేయడం వల్ల బాడీ ఫిట్ గా మారుతుంది. కానీ వయసు పెరిగే కొద్దీ శరీర అవయవాలు కాస్త బలహీనంగా మారుతాయి. అయితే చిన్నప్పటి నుంచి వ్యాయామం చేసేవారిలో ఎముకల బలహీనత తక్కువగా ఉన్నా.. కొన్ని చర్యల వల్ల శరీరం అలిసిపోతుంది. అంటే నిద్ర లేకపోవడం.. పని ఒత్తిడి తీవ్రమవడంతో శరీరం అలిసిపోతుంది. దీంతో నిద్ర లేకుండా జిమ్ చేయడం వల్ల అది ఏమాత్రం మంచిది కాదని జిమ్ సెంటర్ల నిర్వాహకులు అంటున్నారు. మానసిక ఉల్లాసంగా ఉంటేనే జిమ్ చేయాలి. లేకుండా సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు.
సినిమాల్లో ఇప్పటికీ స్టార్ హీరోగా కొనసాగుతున్న రాజ్ కుమార్ పని ఒత్తిడి కావచ్చు.. కుటుంబ ఒత్తిడి కావచ్చు.. ఈ వయసులో ఉన్నవారికి సహజంగానే అవి ఉంటాయి. అయితే ఈనేపథ్యంలో కసరత్తల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. 19-30ఏళ్ల కుర్రాళ్లు చేసే జిమ్ 40 ప్లస్ వాళ్లు చేయడం వల్ల శరీరాన్ని ఎక్కువగా బాధ పెట్టినట్లవుతుంది. ఈ ప్రభావం హార్ట్ పై ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నారు. రాజ్ కుమార్ మరణానికి ఇదే కారణం కావచ్చు అని జిమ్ సెంటర్ల నిర్వాహకులు అంటున్నారు.
సినీ హీరోగానే కాకుండా రాజ్ కుమార్ పేద ప్రజలకు ఎంతో సేవచేశాడని, ఆయన జీవతంలో సగభాగం ఇతరుల సేవకే వినియోగించాడని కన్నడీయులు అంటున్నారు. ఆయన మరణంపై కేవలం సినీ లోకమే కాకుండా రాష్ట్రంలో ఆయన ద్వారా లబ్ది పొందిన వారు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. ఇటీవల ఆయన అన్న శివరాజ్ కుమార్ నటించిన ‘జై భజరంగి’ సినిమా తెలుగులో రిలీజ్ అయింది. ఆ సినిమాకు ఆల్ ద బెస్ట్ చెప్పిన పునీత్ రాజ్ కుమార్ ట్విట్టర్ పోస్టు వైరల్ అవుతోంది.