Begin typing your search above and press return to search.
వరుసగా ఐదు కొట్టేశాడుగా..
By: Tupaki Desk | 30 Jun 2018 5:22 AM GMTప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో అతిపెద్ద దర్శకులు అంటే 0ఓ నలుగురైదుగురి పేర్లు గట్టిగా వినిపిస్తాయి. అయితే అందులో అతి తక్కువ సినిమాలతోనే అందరికంటే టాప్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మాత్రం రాజ్ కుమార్ హిరానీ అని చెప్పాలి. బాలీవుడ్ లో అయితే ఆయన తరువాతే ఇంకెవరైనా. వరుసగా బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకోవడంలో ఈ దర్శకుడు సక్సెస్ అయ్యాడు. చేసింది నాలుగు సినిమాలే. కానీ అవి ఇండస్ట్రీ హిట్స్.
అంతే కాకుండా మంచి మెస్సేజ్ ఇచ్చే దర్శకుడిగానే రాజ్ కుమార్ హిరానికి గుర్తింపు దక్కింది. మున్నాబాయ్ ఎంబీబీఎస్.. లగేరహో మున్నాబాయ్.. 3 ఇడియట్స్.. పీకే.. వంటి సినిమాలు చేసిన ఈ దర్శకుడి నుంచి తరువాతి సినిమా సంజూ లాంటి బ్యాడ్ బాయ్ బయోపిక్ ఉంటుందని ఎవరు ఊహించలేదు. సినిమాను తనదైన శైలిలో తెరకెక్కించి ఐదవ బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టేశాడు. దేశంలోనే అత్యధిక పాపులార్టీ అందుకున్న సినిమాగా సంజూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సినిమాలో అందరూ ఎక్కువగా ఎమోషన్స్ కి కనెక్ట్ అయ్యారు. ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ రావడం లేదు. రాజ్ కుమార్ హిరానీ మరోసారి తన స్థాయిని మరింత పెంచేసుకున్నట్లు చెప్పకనే చెప్పేశారు. ఇక నెక్స్ట్ సినిమా కలెక్షన్స్ ను బట్టి ఇంకెంత విజయాన్ని అందుకున్నారో చెప్పవచ్చు.చూస్తుంటే సరికొత్త రికార్డులను నమోదు చేసేలా ఉందని బాలీవుడ్ క్రిటిక్స్ ఇప్పటికే 3.5 నుంచి 4.5 రేంజ్ లో రేటింగ్ లు ఇస్తూ పొగిడేస్తున్నారు. మొత్తానికి బడా దర్శకుడు పాంచ్ పటాకా కొట్టేశాడు.