Begin typing your search above and press return to search.
`సంజు` నాణేనికి ఒక వైపేనా?
By: Tupaki Desk | 10 July 2018 2:30 PM GMTబాలీవుడ్ విలక్షణ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కిన `సంజు`బయోపిక్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ రికార్డు కలెక్షన్లతో దూసుకు పోతోన్న సంగతి తెలిసిందే. సంజయ్ పాత్రలో రణ్ బీర్ జీవించాడని....హిరాణీ...తన దర్శకత్వ ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, పరిస్థితుల వల్లే సంజూ డ్రగ్స్ తదితర వ్యసనాలకు బానిసయ్యాడని - అతడి తప్పు లేదని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. 'సంజు' సినిమాను సంజయ్ దత్ కోణం లో నుంచి తీశారని - తన మిత్రుడికి హిరాణీ ఇచ్చిన విలువైన బహుమానమే సంజు సినిమా అని కామెంట్స్ చేస్తున్నారు. మీడియా తన జీవితాన్ని వక్రీకరించి ప్రచారం చేసిందని...మీడియాను సంజయ్ దోషిని చేసేందుకు ప్రయత్నించాడని విమర్శలు వస్తున్నాయి.
1993 ముంబై అల్లర్ల ఆరోపణలు - అక్రమాయుధాల కేసు...పై హిరాణీ ఎక్కువగా ఫోకస్ చేయలేదు. అయితే, పేలుళ్ల కుట్ర కేసు నుంచి సంజయ్ నిర్దోషిగా బయటపడ్డా....అక్రమాయుధాల కేసులో జైలు శిక్ష అనుభవించిన విషయం సినిమాలో పైపైన చూపించారు. తనకు అక్రమాయుధాల వాడకం తప్పని తెలియదని సంజయ్ చెప్పడం.....ఆశ్యర్యం కలిగిస్తుంది. అదీగాక - అండర్ వరల్డ్ - మాఫియాతో సంజయ్ దత్ కు ఉన్న సంబంధాలను ఈ సినిమాలో కప్పి పుచ్చారు. 2001లో సంజయ్ దత్ - ఛోటా షకీల్ సంభాషణ ఆడియో సంచలనం రేపింది...కానీ, ఆ విషయం ప్రస్తావించలేదు. మూడు పెళ్లిళ్లు - పిల్లలు - తన చెల్లెళ్లతో సంజయ్ అనుబంధం - హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాల గురించి ప్రస్తావించలేదు. రెండున్నర గంటల వ్యవధిలో సంజయ్ బయోపిక్ తీయలేమని హిరాణీ అన్నారు. జర్నలిస్టులు - లాయర్లు - పోలీసు అధికారులు...ఇలా మొత్తం 40-50మంది వ్యక్తులను కలిసి వారు చెప్పిన విషయాలను బట్టే సంజు తీశానని హిరాణీ చెప్పారు. అయితే, తమ `బాలీవుడ్ `కుటుంబంలోని ఓ వ్యక్తి అయిన సంజయ్ దత్ గురించి అదే కుటుంబంలోని మరో వ్యక్తి....సంజయ్ సన్నిహితుడు హిరాణీ....పక్షపాతం లేకుండా సినిమా తీయగలడా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.