Begin typing your search above and press return to search.
బూతు సినిమాల ఎపిసోడ్ వేళ.. శిల్పా- రాజ్ లకు ఊహించని రిలీఫ్
By: Tupaki Desk | 4 Aug 2021 4:21 AM GMTవినోదం పేరుతో వెర్రి తలలు వేయటం ఈమధ్యన ఎక్కువైంది. నాలుగు రాళ్లు సంపాదించటానికి బుద్ధిగా ఏ పని చేసినా అనుకున్నది పూర్తి చేయొచ్చు. అదేం ఖర్మో కానీ పేరున్న సెలబ్రిటీలు చేసే తప్పుడు పనులు చూస్తే.. నోట మాట రాదంతే. శిల్పాశెట్టి లాంటి భార్య చేతిలో ఉన్నప్పుడు.. వాల్యూ యాడెడ్ కంటెంట్ ద్వారా కోట్లాది రూపాయిలు సంపాదించే ఐడియాల్ని వదిలేసి.. అడ్డమైన బూతు సినిమాల్ని తీసే పాడు ఆలోచనల్ని చేయటమే కాదు.. అలాంటి చేష్టలు అతని ఇమేజ్ మాత్రమే కాదు.. అతగాడి భార్య శిల్పాశెట్టి ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీశాయని చెప్పాలి. వీటికి అదనంగా పోలీసుల కేసులు.. విచారణ.. జైలు జీవితం లాంటివి బోనస్ గా లభించిన దుస్థితి.
బూతు సినిమాల ఎపిసోడ్ తో షాకుల మీద షాకులు తగులుతున్న రాజ్ కుంద్రాకు ఊరట కలిగే పరిణామం ఒకటి చోటు చేసుకుంది. రాముడు మంచి బాలుడన్న చందంగా భర్త మీద వచ్చిన ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన శిల్పా.. ఇప్పుడు అతగాడు చేసిన తప్పులతో ఉక్కిరిబిక్కిరి కావటమే కాదు.. తన ఎదురుగా వచ్చిన భర్తను తీవ్రంగా కడిగేసిన వైనం మీడియాలో పెద్ద ఎత్తున కవర్ కావటం తెలిసిందే. తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నఈ సెలబ్రిటీ జంటకు తాజాగా కాస్తంత ఊరట లభించిందన్న మాట వినిపిస్తోంది.
షేర్ హోల్డింగ్ వివరాల వెల్లడికి సంబంధించి అతిక్రమణలకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రా - శిల్పాశెట్టి దంపతులకు తాజాగా ఊరట లభించింది. ఈ వ్యవహారానికి సంబంధించి సెబీ చేసిన దర్యాప్తులో వారిది తప్పు లేదని తేలింది. నిబంధనలకు తగ్గట్లే వారు వ్యవహరించినట్లుగా స్పష్టమైందని పేర్కొన్న వైనం వారికి భారీ రిలీఫ్ అని చెప్పక తప్పదు. 2015 మారచిలో వియాన్ ఇండస్ట్రీలో 25.75 శాతం వాటాను రాజ్ కుంద్రా శిల్పాశెట్టిల జంట కొనుగోలు చేసింది. దీంతో.. వారిద్దరు ఆ సంస్థకు ప్రమోటర్లుగా మారారు.
అనంతరం సదరు కంపెనీ కొన్ని షేర్లను ప్రిఫరెన్షియల్ అలాట్ మెంట్ కింద కేటాయించింది. అయితే.. ఇదంతా నిబంధనల ప్రకారం జరగలేదన్న ఆరోపణలు వినిపించాయి. దీనిపై రంగంలోకి దిగిన సెబీ విచారణ మొదలు పెట్టింది. 2013 సెప్టెంబరు నుంచి 2015 డిసెంబరు వరకు జరిగిన కార్యకలాపాలను పరిశీలించిన పిమ్మట రాజ్ కుంద్రా - శిల్పాశెట్టిల తప్పు లేదని తేల్చి.. వారిపై చట్టపరమైన చర్యలేమీ తీసుకోవట్లేదని స్పస్టం చేసింది. ఇప్పుడున్న గడ్డు పరిస్థితుల్లో ఇలాంటి సానుకూలాంశం వారికి ఎంతో రిలీఫ్ ను ఇస్తుందన్న మాట వినిపిస్తోంది.