Begin typing your search above and press return to search.
అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు రాజ్ కుంద్రా రూ.25 లక్షల లంచం?
By: Tupaki Desk | 22 July 2021 11:40 AM GMTఅశ్లీల వీడియోల కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా వ్యవహారం మలుపులు తిరుగుతోంది. తనను అరెస్ట్ చేయకుండా తప్పించుకోవడానికి రాజ్ కుంద్రా ఏకంగా రూ.25 లక్షల లంచం చెల్లించారనే వార్త ముంబై సర్కిల్స్ లో గుప్పుమంది. ఈ మేరకు ముంబై మిర్రర్ సహా పలు స్థానిక పత్రికలు ప్రచురించాయి.
ఈ అశ్లీల వీడియోల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ శ్రీవాత్సవ గత మార్చి ముంబైలోని ఏసీబీ అధికారులకు పంపించిన ఈ మెయిల్ లో ఈ విషయాన్ని వెల్లడించాడని ‘మిడ్ డే వార్త సంస్థ సంచలన కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ విషయంపై స్పందించేందుకు ముంబై నగర పోలీస్ అధికారులు నిరాకరించారు.
గత ఫిబ్రవరి 4నే ఈ అశ్లీల వీడియో రాకెట్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. 2021 జులై 19న పోలీసులు రాజ్ కుంద్రాను ఇదే కేసులో అరెస్ట్ చేశారు. ఇంతకాలం కేసు విచారణ చేపట్టారు. అరెస్ట్ కాకుండా ఉండేందుకే లంచం ఇచ్చారా? అన్న ఆరోపణలు వస్తున్నాయి.
అయితే ముంబై క్రైం బ్రాంచ్ అధికారులకు కుంద్రా లంచం ఇచ్చారనే వార్తలపై ఎవరూ నోరు మెదపడం లేదని తెలుస్తోంది. ఏసీబీ అధికారులు ఈ లంచం వ్యవహారాన్ని పోలీస్ కమిషనర్ కు చేరవేశారని.. అనంతరం ఈ అరెస్ట్ లు జరిగాయని అంటున్నారు.
ఈ అశ్లీల చిత్రాల రాకెట్ లో కుంద్రా సూత్రధారి అని పోలీసులు చెబుతున్నారు. అయితే ముంబై క్రైం బ్రాంచి అధికారులకు కుంద్రా లంచం ఇచ్చాడన్న ఆరోపణపై మాత్రం ఒక్కరూ కూడా పెదవి విప్పడం లేదు.