Begin typing your search above and press return to search.
క్రేజీ మాస్క్ లో రాజ్ కుంద్రా వెలిగిపోతున్నాడే!
By: Tupaki Desk | 10 Aug 2022 10:31 AM GMTఇండియాకి కరోనా రాకతో వచ్చిన మార్పుల గురించి చెప్పాల్సిన పనిలేదు. వైరస్ జీవితంలో కొన్ని గుణపాఠాలు కూడా నేర్పింది. శుభ్రత విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి? అన్నది అర్ధమైంది. వైరస్ లు దరిచేరకుండా ఎలా జాగ్రత్త పడాలి అన్నది తెలిసొచ్చింది. గుమ్మం దాటి బయటకు వెళ్తే ముక్కు కి మాస్క్ లేదా ముఖమంతా కవర్ చేసేలా ఫుల్ మాస్క్.. శానిటైజర్ పూసుకుని సామాజిక దూరం పాటిస్తూ ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి కరోనా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు వచ్చినప్పటికీ ఆరోగ్యాభిలాషులంతా ఇంకా కోవిడ్ రూల్స్ పాటిస్తున్నారు.
ఇదంతా కాలంతోపాటు వైరస్ తెచ్చిన మార్పు మాత్రమే. కానీ కొన్ని కొన్ని మార్పులు జీవితంలో స్వయంకృపరాధం ద్వారా కూడా చోటు చేసుకుంటాయని రాజ్ కుంద్రాని చూస్తేనే అర్ధమవుతుంది. ఇదిగో ఇక్కడిలా? కోవిడ్ వారియర్ లా ఇలా మాస్క్ వేసుకుని జనాలకి కనిపించకుండా తిరగాల్సి వస్తోంది. ఆ మధ్య రాజ్ కుంద్రా నీలిచిత్రాల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. భర్తని బయటకు తీసుకురావడం కోసం భార్య శిల్పాశెట్టి ఎంతగా శ్రమించిందో కూడా విధితమే.
బలమైన కేసు కావడంతో బెయిల్ దొరకడం కష్టంగా మారడంతో ఎలాగూ కిందా మిదా పడి బెయిల్ తేగలిగింది. ఈ ఘటన నుంచి తేరుకోవడానికి శిల్పాశెట్టికి తక్కువ సమయమే పట్టింది. రాజ్ కుంద్రా కుటుంబంపై వచ్చిన ఆరోపణలన్నింటిని ఏమాత్రం పట్టించుకోకుండా మునపటిలా పాత జీవితాన్ని కొనసాగించడానికి ఎంతో ధైర్యం కావాలి.
అవన్నీ శిల్పాశెట్టిలో పుష్కలంగా ఉన్నాయని కొద్ది రోజులకే అర్ధమైంది. అమ్మడు యధావిధిగా తన పాత యాక్టివిటీస్ అన్నింటిని తిరిగి కొద్ది రోజులకే పున ప్రారంభించి లైన్ లోకి వచ్చేసింది. కానీ భర్త రాజ్ కుంద్రా మీడియా కంట చాలా రేర్ గానే కనిపిస్తున్నాడు. ఆరోపణల నేపథ్యంలో ముఖాన్ని జనాలకి చూపించలేని పరిస్థితి.
దీంతో కొద్ది రోజులుగా ముఖానికి మాస్క్ వేసుకునే బయటకు తిరుగుతున్నాడు. అదీ చాలా రేర్ గానే బయటకు వస్తున్నాడు. తప్పని పరిస్థితులు తప్ప మిగతా సమయంలో ఇంట్లోనే ఉంటున్నాడు. తాజాగా గురుడు ఇదిగో ఇక్కడ ఇలా వెరైటీగా ఉన్న ఓ ఫేస్ మాస్క్ ని ధరించి బయట కనిపించాడు. ఆ మాస్క్ చుట్టూ మల్టీకలర్ లైట్లు బ్లింక్ అవుతున్నాయి.
జీన్స్ ఫ్యాంట్ పై టీషర్ట్ ధరించి దానిపై బ్లాక్ డిజైన్ రెయిన్ కోట్ ధరించాడు. నెత్తిని పూర్తిగా మంకీ క్యాప్ తో కవరప్ చేసాడు. దానికి సంబంధించిన వీడియో ఒకటిప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. రాజ్ కుంద్రాని అలా చూసి శిల్పాశెట్టి అభిమానులు షాక్ అవుతన్నారు. అతని ముఖానికి ఏమైంది? కరోనా రాకుండా ముందు జాగ్రత్తగా ? అలాంటి ఫేస్ మాస్క్ ధరించాడా? లేక వెలగబెట్టిన పాడు పనికి చూపించలేక మాస్క్ వేసుకున్నాడా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇలాంటి సరదా కామెంట్లు చాలానే ఉన్నాయి.