Begin typing your search above and press return to search.
అరెస్ట్ పసిగట్టి పాత ఫోన్ ను రాజ్ కుంద్రా ఏం చేశాడంటే?
By: Tupaki Desk | 27 July 2021 5:30 PM GMTఅశ్లీల చిత్రాల వీడియోల కేసులో అడ్డంగా బుక్ అయ్యి అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి.
అశ్లీల చిత్రాల కేసులో తనను అరెస్ట్ చేయవచ్చని ముందే పసిగట్టిన రాజ్ కుంద్రా తప్పించుకునేందుకు కొన్ని మాసాల ముందే పక్కా స్కెచ్ గీశారని తేలింది. ‘ప్లాన్ బీ’లో భాగంగా తన పాత మొబైల్ ఫోన్ ను మార్చి నెలలో ఎక్కడో విసిరికొట్టాడట.. కొత్త ఫోన్ వాడటం మొదలుపెట్టాడట..
పాత ఫోన్ లో డేటా పోలీసుల చేతికి చిక్కకుండా రాజ్ కుంద్రా ఈ ఎత్తుగడ వేసినట్లు పోలీసులు తమ దర్యాప్తులో నిర్ధారించారు. తాజా విచారణలో పాత ఫోన్ ఎక్కడుందని రాజ్ కుంద్రాను పోలీసులు ప్రశ్నించగా.. దాన్ని పడేసినట్లు కేంద్రా సమాధానమిచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.
అశ్లీల చిత్రాల కేసులో రాజ్ కుంద్రా ప్రమేయాన్ని నిరూపించేందుకు అవసరమైన పలు ఆధారాలు ఆ పాత ఫోన్ లో ఉండే అవకాశం ఉందని అన్నారు. సదురు పాత ఫోన్ ను రికవరీ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు.
ఈ అశ్లీల రాకెట్ కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కూడా రాజ్ కుంద్రాపై కొరఢా ఝలిపిస్తున్నారు. ఆయనకు సంబంధించిన కాన్పూర్ ఎస్.బీ.ఐ అకౌంట్లను తాజాగా సీజ్ చేశారు. రాజ్ కుంద్రా కేసులో దర్శకుడు తన్వీర్ హస్మీని విచారించారు. పోలీసు విచారణలో తాను అశ్లీల చిత్రాలు తీశానని ఆయన అంగీకరించారని తెలిసింది. దాదాపు 25 అశ్లీల సినిమాలు తీశానని.. వాటిని సాఫ్ట్ అశ్లీల చిత్రాలు అంటారని తన్వీర్ హష్మీ పోలీసుల ముందు ఒప్పుకున్నట్టు సమాచారం.
పోర్న్ రాకెట్ కేసు శిల్పాశెట్టి మెడకు కూడా చుట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఆమె పాత్రను ధ్రువీకరించేందుకు ఆమె ఫోన్ ను క్లోనింగ్ చేయాలని నిర్ణయించారు. ఫోన్ సీజ్ చేసి అందులోని విషయాలను బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో శిల్పాశెట్టి పాత్ర ఉందని అధికారులు బలంగా నమ్ముతున్నారు. ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. శిల్పాశెట్టి అకౌంట్లోకి కోట్లు రూపాయలు నగదు చేరిందని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఈక్రమంలోనే ఈ బ్యాంక్ అకౌంటర్లు కూడా అనుమానాస్పదంగా కనిపించడంతో ఈడీ రంగంలోకి దిగే అవకాశం ఉందనే వార్తలు మీడియాలో వస్తున్నాయి.
శిల్పాశెట్టి-రాజ్ కుంద్రాకు జాయింట్ అకౌంట్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ యాప్ ల ద్వారా వచ్చిన ఆదాయం అంతా ఈ జాయింట్ అకౌంట్లోకి వెళ్లిందని అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. ఈ జాయింట్ అకౌంట్ లో భారీగా ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు పలు విషయాలు బయటకు వచ్చాయని తెలుస్తోంది.