Begin typing your search above and press return to search.
రాజ్ కుంద్రా కాల్స్, వాట్సాప్ డేటాలో బాలీవుడ్ గలీజ్ ఉందా?
By: Tupaki Desk | 24 July 2021 8:42 AM GMTప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్ట్ తో బాలీవుడ్ షేక్ అవుతోంది. ఆయనతో ఆ అశ్లీల దందా నిర్వహించిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా విచారణలో రాజ్ కుంద్రా ఫోన్ లోని వాట్సాప్ చాట్స్, కాల్స్ తో ఆయన ఎవరెవరితో ఈ అశ్లీల దందా నిర్వహించారనే విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
రాజ్ కుంద్రాను కోర్టులో హాజరుపరచగా ఆయనను కోర్టు రిమాండ్ విధించింది. రాజ్ కుంద్రా తన వ్యాపారాన్ని యూకేలోని తన బంధువు అయిన ప్రదీప్ బక్షి భాగస్వామ్యంతో చేసినట్టు పోలీసులు విచారణలో కనుగొన్నారు. బక్షి యూకేలో నివసిస్తున్నారని.. యూకేకు చెందిన కెన్నిన్ ప్రొడక్షన్ హౌస్ నిర్వహిస్తున్నారని క్రైమ్ బ్రాంచ్ వర్గాలు వెల్లడించాయని డీఎన్ఏలోని నివేదిక సూచిస్తోంది.
రాజ్ కుంద్రా మరియు బక్షి మధ్య లీకైన వాట్సాప్ చాట్లు లావాదేవీలు ఎలా జరిగాయో.. అశ్లీల కంటెంట్ ను సృష్టించి వీరు ఎలా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించారోననేది వారి కాల్స్, వాట్సాప్ చాట్స్ ద్వారా బయటపడినట్లు తెలుస్తోంది.
పోలీస్ వర్గాల విచారణ లో తేలిన నిజాలు బయటకొస్తున్నాయి. నివేదికల ప్రకారం రాన్ కెన్నిన్ ప్రోడక్షన్ హౌస్ లో రాజ్ కుంద్రా పీఏ ఉమేశ్ కామత్ భారత దేశంలో సంస్థ ప్రతినిధిగా పనిచేశారు. ఆయన అశ్లీల చిత్రాల తయారీకి సంస్థ ఏజెంట్లకు ఒప్పందాలు చేసినట్టు తేలింది. నిధులను కూడా సులభతరంగా చేశారని తేలిందట..
ముంబై పోలీసులు ఉమేష్ కామత్ ను కీలక కుట్రదారుగా ముద్ర వేస్తున్నాడు. ముంబై సీపీ విడుదల చేసిన ఒక ప్రకటనలో ‘అశ్లీల చిత్రాల సృష్టి, కొన్ని యాప్ లలో అప్ లోడ్ చేసిన కేసులో రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశామని.. అతడే ముఖ్య కుట్రదారుడు అని తేలిందన్నారు. దీనికి సంబంధించిన ఆయన కాల్స్, వాట్సాప్ లలో కీలక ఆధారాలు ఉన్నాయని.. దర్యాప్తులో బయటపెడుతామని’ తెలిపారు.
రాజ్ కుంద్రా కాల్స్, వాట్సాప్ లలో ఎంతో మంది బాటీవుడ్ ప్రముఖులు ఈ అశ్లీల దందాలో పాలుపంచుకున్నారని.. ఆ గలీజు దాందా అంతా ఉందని వార్తలు వస్తున్నాయి. బయటకు చెప్పలేని వాళ్ల పేర్లు, హీరోలు, మీరోయిన్లు కూడా ఈ గలీజు పనులు చేశారని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే పోలీసులు ప్రస్తుతం రాజ్ కుంద్రా ఫోన్ డేటాను ఫోరెన్సిక్ తో విశ్లేషిస్తున్నారు. అది బయటకొస్తే ఎందరి పేర్లు ఈ గలీజు దాందాలో ఉన్నాయో బయటపడుతుంది.అ దే జరిగితే బాలీవుడ్ షేక్ కావడం ఖాయమని.. బాలీవుడ్ లోని ప్రముఖుల బండారం బయటపడుతుందని ప్రచారం సాగుతోంది. మరి ఆ పేర్లు బయటకొస్తాయా? లేదా అన్నది చూడాలి.