Begin typing your search above and press return to search.
రాజ్ కుంద్రా అశ్లీల బిజినెస్ ప్లాన్స్.. సంచలన విషయాలు
By: Tupaki Desk | 27 July 2021 4:30 PM GMTప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. ఆయనే ప్రధాన నిందితుడిగా భావించి ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముంబై పోలీసులు తాజాగా మొదటి చార్జీషీట్ దాఖలు చేశారు. ఈ చార్జీషీట్ లో కీలక విషయాలు వెల్లడించారు.
పోర్నోగ్రఫీ ద్వారా సముపార్జించే ఆదాయ వివరాలను, వారి లక్ష్యాలను ఈ చార్జీషీట్ లో పేర్కొన్నారు. 2023వరకు రాజ్ కుంద్రా ప్రణాళికలు వేశాడని.. ఈ అశ్లీల కంటెంట్ ద్వారా బోలీఫేమ్ మీడియా లిమిడెడ్ రూ.146 కోట్ల ఆదాయం, రూ.30 కోట్ల నికర లాభం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పోలీసులు తమ చార్జిషీట్ లో పేర్కొన్నారు.
హాట్ షాట్ ఇబ్బందుల్లో పడితే ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ప్లాన్ బిగా రాజ్ కుంద్రా 'బోలీఫేమ్ లిమిటెడ్'ను సృష్టించారని చార్జీషీట్ లో పోలీసులు పేర్కొన్నారు. కాగా ఈ చార్జ్ షీట్ లో పోర్నోగ్రఫీ వీడియోల ద్వారా ఏ సంవత్సరానికి ఎంత స్థూల ఆదాయం, ఎంత నికర ఆదాయాన్ని అంచనాగా పెట్టుకున్నారనే వివరాలను క్లుప్తంగా పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించి స్థూల రాబడి, నికర లాభాల వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం 2021-22 సంవత్సరానికి సంబంధించి స్థూల ఆదాయం రూ.36.50 కోట్లుగా పేర్కొన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్ నుంచే రాజ్ కుంద్రా ఈ 'బోలిఫేమ్ మీడియాను నిర్వహించారు. హాట్ షాట్ నుంచి చాలా కంటెంట్ ను బోలీఫేమ్ కు బదిలీ చేశారని గుర్తించారు. రాజ్ కుంద్రా కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న సర్వర్ ను ఫోరెన్సిక్ కు పంపించామని.. అందులో అశ్లీల కంటెంట్ అప్ లోడ్ కు సంబంధించి ఆధారాలు కూడా లభిస్తాయని అధికారులు తెలిపారు.
ఇక హాట్ షాట్ చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో కామత్, రాజ్ కుంద్రా, ప్రదీప్ బక్షి మధ్య వాట్సాప్ చాట్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ చాట్ లోనూ వీరు బోలీఫేమ్ ను 'ప్లాన్ బి'గా సిద్ధం చేసినట్లు గుర్తించారు. హాట్ షాట్ కంటే ఎక్కువ ఆదాయం, సబ్ స్క్రిప్షన్ తీసుకువస్తామని చెప్పి బోలీ ఫేమ్ లో ప్రముఖులను లైవ్ స్ట్రీమ్ లోకి తీసుకురావాలని వారు ప్రయత్నించినట్లు చార్జీషీట్ లో అధికారులు పేర్కొన్నారు.