Begin typing your search above and press return to search.

కుంద్రా స్కాండ‌ల్: సాటి తార‌లే రొంపిలోకి దించి వేధిస్తారు! లొంగ‌క‌పోతే బెదిరిస్తారు!!

By:  Tupaki Desk   |   29 July 2021 3:53 PM GMT
కుంద్రా స్కాండ‌ల్: సాటి తార‌లే రొంపిలోకి దించి వేధిస్తారు! లొంగ‌క‌పోతే బెదిరిస్తారు!!
X
అశ్లీల వీడియో యాప్ ల‌ కేసులో రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన తర్వాత నటి గెహనా వశిష్ఠ్ పేరు ప్ర‌ముఖంగా హెడ్ లైన్స్ లో వినిపిస్తోంది. గెహ‌నాతో పాటు రోవా ఖాన్ కూడా ఇదే కేసులో న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. పోలీసులకు సన్నిహిత వర్గాలు ఈ ఇద్దరు బాధితుల వాంగ్మూలాలను విడుదల చేశాయి. బాలిక‌లు అయిన మోడ‌ల్స్ ని ట్రాప్ లో వేసి వేధించేది ఆడాళ్లే న‌ని చివ‌రికి తేలింది. సాటి న‌టీమ‌ణులే రొంపిలోకి దించుతారు. వేధిస్తార‌ని తెలుస్తోంది. అయితే అవ‌కాశాల కోసం వ‌చ్చి రొంపిలోకి దిగాక ఏమీ తోచ‌ని స్థితిలో వీరంతా తిరిగి ఆ ఛైన్ స్కీమ్ ని కొన‌సాగిస్తార‌ని కూడా తాజాగా డేటా రివీలైంది.

క్రైమ్ బ్రాంచ్ విచార‌ణ‌లో ప‌లువురు మోడ‌ల్స్ గెహానా - రోవా అనే పేర్లు పెట్టారు. అశ్లీల వీడియోలను చిత్రీకరించమని బలవంతం చేసింది ఆ ఇద్ద‌రేన‌ని తెలిపారు. మరాఠీ- భోజ్‌పురి- హిందీ చిత్రాలలో పనిచేసిన 25 ఏళ్ళ వయసున్న మొదటి బాధితురాలు తన ప్రకటనలో ఈ ఏడాది ఫిబ్రవరిలో రోవా ఖాన్ తో కలిసి చేయాల్సిన ఒక ప్రాజెక్ట్ ను త‌న‌కు బ‌ద‌లాయిస్తున్నట్లు ఆమె తెలిపారు. నన్ను అసౌకర్యంగా చాలా చిన్న బట్టలు ధరించిన తరువాత నాకు స్క్రిప్ట్ అందజేశారు. రోవా ఖాన్ నాకు రూ .25000 చెల్లిస్తానని హామీ ఇచ్చారు. స్క్రిప్ట్ చదివిన తరువాత నేను డ‌ర్టీగా భావించాను. దానిలో న‌టించేందుకు నిరాకరించాను.

అయితే ఈ చిత్రం చేయమని రోవా ఆమెను ఒప్పించింది. సగం స్క్రిప్ట్ చిత్రీకరించిన తరువాత రోవాతో పాటు కెమెరామెన్ నగ్న ప్రదర్శన చేయవలసి ఉంటుందని తెలియజేశారు. రోవా మిగిలిన అన్ని సన్నివేశాలను బట్టలు లేకుండా చిత్రీకరిస్తానని నాకు చెప్పింది. కానీ నేను నిరసన వ్యక్తం చేసినప్పుడు ఆమె నాపై కేసు పెడతామని బెదిరించింది. షూటింగ్ కి అన్ని ఖర్చులకు నష్టపరిహారం చెల్లించవలసి వస్తుందని ఆమె బెదిరించింది. అంతేకాదు ఎవరూ నాతో పనిచేయరని కూడా హెచ్చ‌రించింద‌ని తెలిపారు.

మరోవైపు 2016 నుండి హిందీ - మరాఠీ సీరియళ్లలో పనిచేస్తున్న 20 సంవత్సరాల వయస్సు గల రెండవ బాధితురాలు తన ప్రకటనలో ఆమెకు గెహానా వశిష్ట్ చేయబోయే వెబ్ సిరీస్ ను అందిస్తున్నట్లు తెలిపింది. షూటింగ్ ప్రారంభమైన తర్వాత తనకు అసౌకర్యంగా ఉందని అలా చేయడానికి నిరాకరించానని ఆమె తన ప్రకటనలో తెలిపింది. కానీ గెహనా ఆమెను బెదిరించి సినిమా షూటింగ్ కోసం బలవంతంగా తీసుకెళ్లింది. సిరీస్ షూటింగ్ కోసం వారు 10 లక్షల రూపాయలు ఖర్చు చేశారని నేను వెళ్లిపోతే వారికి 10 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆమె నాకు చెప్పారు. షూట్ పూర్తయిన తర్వాత నన్ను వెళ్లనివ్వమని నేను గెహానాను వేడుకున్నాను. కానీ ఈ షూట్ గురించి ఎవరితోనూ మాట్లాడవద్దని పోలీసుల వద్దకు వెళ్లవద్దని లేదా భయంకరమైన పరిణామాలు ఉంటాయని ఆమె నన్ను బెదిరించింది.. అని తెలిపారు.

వ‌ల వేయ‌డం.. బ‌ల‌వంతం చేయ‌డం.. వేధించ‌డం.. రొంపిలోకి దిగాక బ‌య‌ట‌ప‌డ‌కుండా ఉచ్చు వేయ‌డం.. కొంత షూట్ అయ్యాక వెళ్లిపోతానంటే ఎదురు డ‌బ్బు క‌ట్టాల‌ని బెదిరించ‌డం.. వ‌గైరా వ‌గైరా ముంద‌స్తు ప్ర‌ణాళికలు ఈ స్కీమ్ లో ఉంటాయి. ఎవ‌రైనా న‌టీమ‌ణి ఒక‌సారి ఈ ఉచ్చులో ప‌డితే ఇక ఖ‌తం. ఆ త‌ర్వాత ఆ ఛైన్ బిజినెస్ కి తాను స‌హ‌క‌రించాల్సిందే. నిజానికి డ్ర‌గ్స్ సేవించేవారు ఇత‌రులను రింగులోకి లాగిన‌ట్టే.. ఈ న‌గ్న వీడియోల భోగోతంలోనూ బాలిక‌లైన మోడ‌ల్స్ ని బ‌ల‌వంతంగా దించుతార‌ని ప్రూవ్ అవుతోంది.