Begin typing your search above and press return to search.
రివ్యూ: 'అహ నా పెళ్ళంట!' (వెబ్ సిరీస్)
By: Tupaki Desk | 17 Nov 2022 4:12 PM GMTనటీనటులు: రాజ్ తరుణ్ - శివాని రాజశేఖర్ - హర్షవర్ధన్ - ఆమని - పోసాని కృష్ణ మురళి - గెటప్ శ్రీను - మధునందన్ - తాగుబోతు రమేష్ - భద్రం - రఘు తదితరులు
సంగీతం: జాదుహ్ శాండీ
సినిమాటోగ్రఫీ: నగేష్ బన్నెల్ - అక్షర్ అలీ
మాటలు: కళ్యాణ్ రాఘవ
ఎడిటర్: మధు రెడ్డి
కథ & స్క్రీన్ ప్లే: షేక్ దావూద్
నిర్మాత: సూర్య రాహుల్ తమాడ - సాయిదీప్ రెడ్డి బొర్రా
దర్శకత్వం: సంజీవ్ రెడ్డి
సినీ ప్రేక్షకులకు వినోదం అందించడానికి బిగ్ స్క్రీన్ కోసం తెరకెక్కే సినిమాలతో పాటుగా ఓటీటీలలో వెబ్ సిరీస్ లు అందుబాటులోకి వచ్చాయి. పాండమిక్ తర్వాత తెలుగులోనూ వెబ్ సిరీస్ లు ఊపందుకున్నాయి. ప్రముఖ ఓటీటీ జీ5 సరికొత్త సినిమాలు మరియు ఒరిజినల్ సిరీస్ లతో వీక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు ''అహ నా పెళ్ళంట!'' అనే సిరీస్ ని తీసుకొచ్చింది. రాజ్ తరుణ్ మరియు శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథలోకి వెళ్తే.. శ్రీను (రాజ్ తరుణ్) చిన్నప్పుడు తన తల్లిదండ్రులు సుశీల (ఆమని) మరియు నోబాల్ నారాయణ (హర్ష వర్ధన్)కు ఇచ్చిన మాట కోసం అమ్మాయిల వైపు కన్నెత్తి కూడా చూడడు. తాను ఎప్పుడు అమ్మాయి వైపు చూసినా తన తండ్రికి ఏదోకటి జరుగుతుందని నమ్ముతుంటాడు. అయితే పెళ్లీడు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పడంతో.. ఎన్నో సంబంధాలు చూసిన తర్వాత ఎట్టకేలకు ఒక అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. తీరా పెళ్లి పీటలెక్కిన తర్వాత పెళ్లికూతురు తన బాయ్ ఫ్రెండ్ తో లేచిపోతుంది. చుట్టుపక్కల వారి మాటలతో ఎంతో బాధను అనుభవించిన అతను ఉద్యోగరీత్యా వేరే నగరానికి చేరుకుంటాడు. అయితే అక్కడ పెళ్లి కూతురు తండ్రి మహేంద్ర(పోసాని కృష్ణ మురళి) ద్వారా తన పెళ్లి చెడిపోవడానికి మహా (శివానీ రాజశేఖర్) కారణమని శ్రీను తెలుసుకుంటాడు. ఆమె పెళ్లి కూడా చెడగొట్టి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న శ్రీను.. మహేంద్ర చెప్పిన కిడ్నాప్ ప్లాన్ ని తన ఇద్దరు స్నేహితులతో కలిసి అమలు చేస్తాడు. ఆ తర్వాత శ్రీనుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఈ క్రమంలో శ్రీను - మహాల మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అసలు అతని పెళ్లి చెడిపోవడానికి మహా ఎలా కారణమైంది? చివరకు ఏం జరిగింది? అనేది తెలుసుకోవాలంటే ''అహ నా పెళ్ళంట!'' వెబ్ సిరీస్ చూడాల్సిందే.
పెళ్లి పీటలెక్కిన తర్వాత తాళి కట్టే సమయంలో పెళ్లి కూతురు తన బాయ్ ఫ్రెండ్ తో వెళ్లిపోవడం అనే కాన్సెప్ట్ తో ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి. ఇప్పుడు 'అహా నా పెళ్ళంట' సిరీస్ కూడా అదే కాన్సెప్ట్ తో కామెడీ మరియు ఎమోషనల్ డ్రామాతో చిన్న చిన్న ట్విస్టులతో తీర్చిదిద్దారు. వివాహానికి సంబంధించి తెరసాల - పాణిగ్రహణం - బ్రహ్మముడి - సప్తపది - అరుంధతి నక్షత్రం - జీలకర్ర బెల్లం - మధుపర్కం - మంగళసూత్ర ధారణ వంటి పేర్లతో ఒక్కో ఎపిసోడ్ ని చూపించడం బాగుంది. అయితే దీని కోసం కథను ఎనిమిది ఎపిసోడ్స్ గా చేయడం ఇబ్బందిగా మారిందని చెప్పాలి.
మొదటి ఎపిసోడ్ శ్రీను తన లైఫ్ గురించి చెప్పడంతో ప్రారంభం అవుతుంది.. అతని పెళ్లి ఆగిపోవడంతో ఎండ్ అవుతుంది. మధ్యలో అంతా పాత్రల పరిచయాలు - శ్రీను పాత్ర స్వభావాన్ని ఎలివేట్ చేయడానికి ఉపయోగించుకున్నారు. రెండో ఎపిసోడ్ లో మహాని కిడ్నాప్ చేయడం కోసం ప్లాన్ చేయగా.. మూడో ఎపిసోడ్ నుంచి మహా ఎంట్రీ ఇస్తుంది. ఇందతా కూడా చాలా రొటీన్ సన్నివేశాలతో అక్కడక్కడా నవ్వు తెప్పిస్తూ చాలా నెమ్మదిగా సాగుతుంది. మహాని శ్రీను తన ఫ్లాట్ కి తీసుకొచ్చిన తర్వాత తన స్నేహితులతో వచ్చే కామెడీ సీన్స్ కూడా ఏమాత్రం నవ్వు తెప్పించవు.
శ్రీను - మహా మధ్య స్నేహం మరియు ప్రేమ పుట్టడం వంటి సన్నివేశాలతో మిగతా ఎపిసోడ్లు సాగుతాయి. ఇవి కూడా ఏమంత కొత్తగా అనిపించవు. ప్రధాన పాత్రల మధ్య ప్రేమ పుట్టే సన్నివేశాలను.. సంఘర్షణను దర్శకుడు సరిగ్గా ప్రెజెంట్ చేయలేదు. కథంతా ఆ నాలుగైదు పాత్రల మధ్యే తిరుగుతుండటంతో ఏమాత్రం ముందుకు కదలడం లేదనే ఫీలింగ్ ని కలిగిస్తుంది. అప్పటి వరకూ మామూలు ఫ్యామిలీ డ్రామాగా సాగుతుండగా.. క్లైమాక్స్ కి వచ్చే సరికి సెటప్ అంతా ఒక్కసారిగా ఎయిర్ పోర్ట్ కు మారిపోవడం.. హీరోహీరోయిన్లు మాట్లాడుకున్న మాటలను బట్టి టెర్రరిస్ట్ ఫ్లైట్ లో బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేయడం వంటివి సిల్లీగా అనిపిస్తాయి. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం బాగుంది.
ఇంతకు ముందు 'ఏబీసీడీ’ చిత్రాన్ని తెరకెక్కించిన సంజీవ్ రెడ్డి.. రొటీన్ లైన్ ని తీసుకున్నా ఎలాంటి వైలెన్స్ - వల్గారిటీ - అభ్యంతరకరమైన సన్నివేశాలు లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూడగలిగేలా 'అహ నా పెళ్ళంట!' వెబ్ సిరీస్ ని రూపొందించారని చెప్పాలి. అక్కడక్కడా వచ్చే బూతు డైలాగ్స్ ను కూడా మ్యూట్ చేసారు. అయితే దర్శకుడు తాను అనుకున్న కథని ఎంగేజింగ్ గా చెప్పలేకపోయారు. స్లో నేరేషన్ కి తోడుగా సీన్స్ అన్నీ రిపీట్ అవుతున్నాయనే భావన కలుగుతుంది. ఇందులో అన్ని పాత్రలు కూడా ఒక్కోసారి తెలివిగా బిహేవ్ చేస్తుంటాయి.. మరికొన్ని సందర్భాల్లో చాలా తింగరిగా ప్రవర్తిస్తూ ఉండటంతో ఒకానొక దశలో కాస్త చిరాకుగా అనిపిస్తుంది. ఒకసారి హీరోని సిగరెట్ మానేయమని చెప్పే హీరోయిన్.. ఆ వెంటనే హీరో బ్యాచ్ తో కలిసి మందు కొట్టడం లాంటి సీన్స్ చూస్తుంటే.. ఇంకొంచం వర్క్ చేసి ఉండాల్సింది అనిపిస్తుంది. అలానే స్పీకర్ ఆన్ చేసి ఫోన్ సంభాషణ సాగించే సన్నివేశాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి.
శ్రీను పాత్రలో రాజ్ తరుణ్ ఎప్పటిలాగే తనకు అలవాటైన పాత్రలో చాలా ఈజ్ తో నటించేసాడు. ఓటీటీ డెబ్యూతోనే ఆకట్టుకున్నాడు. వెబ్ సిరీస్ అనగానే అస్లీలత - అభ్యంతరకరమైన కంటెంట్ ని కాకుండా.. ఫ్యామిలీ అంతా చూసే సిరీస్ ని ఎంచుకున్నందుకు యువ హీరోని మెచ్చుకోవాలి. మహాగా శివానీ రాజశేఖర్ కూడా బాగా నటించింది. కాకపోతే కొన్ని సీన్స్ లో ఆమె పాత్ర తాలూకు 'అతి' కనిపిస్తుంది. అలానే లుక్స్ పరంగా ఒక్కోసారి ఒక్కో విధంగా కనిపించింది. సీరియల్స్ మీద బెట్టింగ్ వేసే సుశీలగా ఆమని.. నో బాల్ నారాయణగా హర్ష వర్ధన్ ఆకట్టుకున్నారు. పోసాని - గెటప్ శీను - తాగుబోతు రమేష్ సహా మిగతా ప్రధాన పాత్రదారులు తమ పరిధి మేరకు నటించారు. రాజ్ తరుణ్ ఫ్రెండ్స్ గా నటించిన రవితేజ - త్రిశూల్ లకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరికింది. 'రాజావారు రాణిగారు' ఫేమ్ రాజ్ కుమార్ కసిరెడ్డి కొన్ని సీన్లకే పరిమితమైనా.. తనదైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు.
ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. పాటలు మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే. అయితే ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా చేయాల్సి ఉంది. కొన్ని సీన్స్ కి కత్తెర వేయాల్సింది. అలాగే నేటి యువత మాట్లాడుకునేలా రాసిన డైలాగ్స్ బాగున్నాయి. మొత్తం మీద రెగ్యులర్ వెబ్ సిరీస్ లకు భిన్నంగా ఫ్యామిలీ అంతా కలిసి చూడగలిగే సిరీస్ గా 'అహ నా పెళ్ళంట' ను తీర్చిదిద్దారు. బోరింగ్ సీన్స్ స్కిప్ చేసే ఆప్షన్ ఓటీటీలో ఎలాగూ ఉంది కాబట్టి.. ఈ వీకెండ్ లో ఈ సిరీస్ ని ఒక ఆప్షన్ గా పెట్టుకోవచ్చు.