Begin typing your search above and press return to search.
కుక్కల్ని హడలెత్తించే కిట్టుగాడు
By: Tupaki Desk | 5 Sept 2016 11:38 AM ISTవెండితెరపై చాలామంది దొంగల్ని చూస్తుంటాం. ఒకప్పుడు దొంగ అంటే విలనే. ఆ దొంగ విలన్ భరతం పట్టడమే హీరో పనిగా ఉండేది. కానీ ఇటీవల హీరోయిజానికి కూడా దొంగ పాత్రల్ని వాడుకోవడం ఎక్కువైంది. రాజుగారి కోటని కూడా అవలీలగా కొల్లగొట్టి హీరోయిజాన్ని ప్రదర్శిస్తుంటారు మన సినిమా దొంగలు. అయితే తెరపైకి ఇప్పుడు మరో కొత్త రకమైన దొంగ వచ్చాడు. కుక్కల్ని దోచేసే దొంగ అతను. పేరు కిట్టు. వాడి కన్ను పడితే చాలు... ఎంత డేంజరస్ కుక్కైనా మాయమవ్వాల్సిందే. మనుషుల్ని హడలెత్తించే కుక్కల్ని చూసుంటాం కానీ... కుక్కల్నే హడలెత్తించే మనిషన్నమాట కిట్టు. అందుకే ఇళ్ల దగ్గర బివేర్ ఆఫ్ డాగ్స్ అని బోర్డులు ఎలా పెడుతుంటామో... కుక్కలు కూడా బివేర్ ఆఫ్ కిట్టు అని జాగ్రత్తలు చెప్పుకొంటుంటాయి.
ఇంతకీ ఈ కుక్కల దొంగ కిట్టుగాడుగా కనిపించే ఆ హీరో ఎవరో తెలుసా..? రాజ్ తరుణ్. దొంగాట ఫేమ్ వంశీకృష్ణ దర్శకత్వంలో ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కబోతోంది. అందులో రాజ్ తరుణ్ హీరోగా నటించబోతున్నాడు. కుక్కల దొంగగా రాజ్ తరుణ్ కనిపించబోతున్నాడు. వినాయక చవితిని పురస్కరించుకొని ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఆ పోస్టర్ ఆన్ లైన్ లో అందరినీ ఆకట్టుకొంటోంది. త్వరలోనే ఈ సినిమా పేరును ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపింది.