Begin typing your search above and press return to search.
రాజ్ తరుణ్ బాలీవుడ్ రీమేక్.. వరుసలో 4 సినిమాలు!
By: Tupaki Desk | 5 March 2021 3:30 PM GMTయంగ్ హీరో రాజ్ తరుణ్.. కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. ప్రస్తుతం హిట్టు తప్పనిసరి అనే పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా 'పవర్ ప్లే' అనే థ్రిల్లర్ సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రాజ్ తరుణ్. సినిమా రిజల్ట్స్ గురించి పక్కనపెడితే కుమారి21ఎఫ్ సినిమా తర్వాత రాజ్ తరుణ్ ఖాతాలో అన్ని ప్లాప్ సినిమాలే పడ్డాయి. సరైన హిట్ కోసం ఇన్నేళ్లుగా ట్రై చేస్తున్నాడు. లవ్ స్టోరీస్, కామెడీ జానర్స్ చూసి జనాలకు బోర్ కొట్టేసింది. ఇప్పుడు అన్ని కొత్తరకం సినిమాలనే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. అందుకే రూట్ మార్చి థ్రిల్లర్ మూవీ చేసాడు. ఉయ్యాలా జంపాల సినిమాతో తెలుగుతెరకు హీరోగా పరిచయయ్యాడు రాజ్ తరుణ్. ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో మొదట్లో జాగ్రత్తగానే సినిమాలు సెలెక్ట్ చేసుకున్నాడు. అందుకే సినిమా చూపిస్తా మావ, కుమారి21ఎఫ్ హిట్స్ సొంతం చేసుకున్నాడు.
ఆ తర్వాత అవకాశాలు వస్తున్నాయి కదా అని వెనకాముందు చూడకుండా ఏ సినిమా పడితే ఆ సినిమా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ప్లాప్ లతో వెనకబడి పోయాడు. ఇప్పుడు మళ్లీ హిట్టు కోసం నానాతంటాలు పడుతున్నాడు. చివరిగా 'ఒరేయ్ బుజ్జిగా' మూవీ చేసాడు కానీ దాని ఫలితం ఎటూ తేలకుండా ఉంది. అందుకే మళ్లీ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో 'పవర్ ప్లే' సినిమా చేసాడు. ఇదిలా ఉండగా.. ఆదరణ ఎలా ఉన్నా అవకాశాలు మాత్రం హీరోకు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం తన చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. తాజాగా ఆ సినిమాల విషయాలను బయటపెట్టాడు.
'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' చేసిన శ్రీనివాస్ గవిరెడ్డితో మరో సినిమా. ఇప్పటికే ఈ సినిమా పూర్తి కావచ్చిందని టాక్. అలాగే తనను పరిచయం చేసిన డైరెక్టర్ విరించి వర్మతో మరో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా దాదాపు 60 శాతం పూర్తయిందని చెప్పాడు. అలాగే శాంటో అనే నూతన దర్శకుడితో ఓ సినిమా చేయనున్నాడట. ఇవన్నీగాక విజయ్ కుమార్ కొండాతో హ్యాట్రిక్ సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘డ్రీమ్ గర్ల్’ సినిమాను విక్రమ్ తో కలిసి రీమేక్ చేయనున్నాడు. అయితే ఆ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్లు తెలిపాడు రాజ్ తరుణ్. చూస్తుంటే ఈ కుర్రహీరో ఊపు మాములుగా లేదు. చూడాలి మరి రాజ్ తిరిగి హిట్ ట్రాక్ లోకి వస్తాడేమో!