Begin typing your search above and press return to search.
చైతూ లేడు..సమంత లేదు..కుర్రాడున్నాడు
By: Tupaki Desk | 14 Dec 2017 5:29 PM GMTత్వరలోనే రిలీజ్ కానున్న సినిమాల్లో.. ఎవరు హిట్టు కొట్టినా కొట్టకపోయినా కూడా.. అక్కినేని అఖిల్ మాత్రం ''హలో'' సినిమాతో భారీ హిట్టు కొట్టాల్సిందే. ఆల్రెడీ తొలి సినిమా డిజాష్టర్ తో ఖంగుతిన్ను ఈ యంగ్ హీరో.. ఇప్పుడు తన సత్తా చాటేస్తానని డైరక్టుగానే చెబుతున్నాడు. అలాగే నాగార్జున కూడా.. వస్తున్నాం కొడుతున్నాం అంటూ చాలా పెద్ద స్టేట్మెంట్ లే ఇచ్చారు.
ఇక మొన్నటివరకు వినిపించిన టాక్ ఏంటంటే.. హలో సినిమాలో నాగచైతన్య అండ్ సమంత స్పెషల్ క్యామియో రోల్ చేశారంట. కాని నిజానికి అది కేవలం రూమరే అంటున్నారు అన్నపూర్ణ స్టూడియోస్ వర్గాలు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక హాట్ న్యూస్ మాత్రం బయటకు వస్తోంది. ఈ సినిమాలో కుర్ర హీరో రాజ్ తరుణ్ ఒక చిన్న క్యామియో చేశాడట. నాగార్జున అడగ్గానే రాజ్ తరుణ్ ఆ పాత్రను చేయడానికి ఒప్పుకున్నాడని అంటున్నారు. కాని అక్కడే చిన్న డిజప్పాయిట్మెంట్ ఉంది మరి.
ఒక ప్రక్కన చైతూ అండ్ సమంత.. ఈ సినిమాలో అఖిల్ ప్రక్కనే కనిపిస్తారని అనుకుంటే.. ఇలా అక్కినేని హీరోలను వదిలేసి రాజ్ తరుణ్ ను తీసుకురావడంపై అక్కినేని ఫ్యాన్స్ అప్సెట్ అవుతున్నారు. కొందరైతే ఇంకాస్త ముందుకెళ్ళి అఖిల్ కు స్నేహితులు మరియు సన్నిహితులు అయిన రామ్ చరణ్ లేదా బెల్లంకొండ శ్రీనివాస్ వంటి హీరోలను పెట్టుంటే బాగుండేది కాని.. అసలు రాజ్ తరుణ్ ను ఎందుకు దించారంటూ ప్రశ్నిస్తున్నారు. అది సంగతి.