Begin typing your search above and press return to search.
పాపం.. రాజ్ తరుణ్ కెరీర్ కి ఏదో పట్టుకుంది...!
By: Tupaki Desk | 2 May 2020 2:00 PM GMT'ఉయ్యాలా జంపాల' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన యువ హీరో రాజ్ తరుణ్. మొదటి సినిమాకే సురేష్ బాబు - నాగార్జున లాంటి వారి సపోర్ట్ ఉండటంతో మంచి విజయాన్ని అందుకొని క్రేజీ హీరోగా మారిపోయాడు. కొన్ని రోజులపాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాకుండా వరుస అవకాశాలు తలుపుతట్టాయి. కెరీర్ ఆరంభంలో తన హుషారైన నటనతో అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు. రాజ్ తరుణ్ ని చూసి అందరూ మరో రవితేజ అని ప్రశంసలు కూడా కురిపించారు. ఆ తర్వాత 'సినిమా చూపిస్త మామ' 'కుమారి 21 ఎఫ్' లాంటి సూపర్ హిట్స్ సొంతం చేసుకున్నాడు. కానీ ఇటీవల రాజ్ తరుణ్ కు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. ఎన్ని సినిమాలు సెట్ చేసినా హిట్ మాత్రం అందని ద్రాక్షలా మారింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ కు కెరీర్ పరంగా డూ ఆర్ డై సిచ్యుయేషన్ క్రియేట్ అయ్యిందని చెప్పవచ్చు. దీంతో నెక్స్ట్ సినిమాతో అయినా సక్సెస్ అందుకోవాలని ఎంతో కష్టపడి 'గుండజారి గల్లంతయ్యిందే' ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాలో నటించాడు రాజ్ తరుణ్. మాళవికా అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించారు. ఈ సినిమా మార్చి 25న ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా విడుదల ఆగిపోయింది.
ఇంతా కష్టపడి సినిమా మొత్తం చాలా ఫన్నీగా.. బాగా వచ్చిందని వెయిట్ చేస్తున్న టైమ్ లో సినిమా రిలీజ్ కరోనా వల్ల సినిమా విడుదల ఆగిపోయిందని డీలా పడిపోయాడట రాజ్ తరుణ్. అయితే మనోడి అవకాశాలకి ఇబ్బంది లేదు. ఎందుకంటే రాజ్ తరుణ్ మేనేజర్ చాలా పవర్ ఫుల్ పలుకుబడి ఉన్నోడు అవ్వడం వల్ల ఏదో మాయ చేసి సినిమాలు మాత్రం తీసుకొస్తుంటాడట. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ నుంచి ఇప్పడు రిలీజ్ అవుతున్న సినిమా కాకుండా మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయట. మనోడికి వచ్చిన ఫ్లాపులకి అస్సలు సినిమాలే రావు అనే తరుణంలో రెండు సినిమాల్లో హీరోగా కన్ఫామ్ అయ్యాడు. వాటిలో ఒకటి అన్నపూర్ణ బ్యానర్ మీద చేస్తున్నారు.. మరొకటి ఎవరో ఎన్.ఆర్.ఐ నిర్మాతగా వ్యవహరిస్తున్న ప్రాజెక్టట. అయితే ఈ సినిమాలు కరోనా క్రైసిస్ తరువాత సెట్స్ మీదకి వస్తాయో రావో అనే డౌట్ క్రియేట్ అవుతోందట. అంతేకాకుండా నిర్మాత రామ్ తళ్లూరి దగ్గర ఆడ్వాన్స్ తీసుకున్నాడట. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవుద్దో లేదో అని ఆలోచిస్తున్నారట. దీనితో రాజ్ తరుణ్ కెరీర్ సందిగ్ధం లో పడే అవకాశం ఉందని చెప్పవచ్చు. పాపం రాజ్ తరుణ్ కెరీర్ కి ఏదో పట్టుకుందని ఇండస్ట్రీ వర్గాలు కామెంట్స్ చేస్తున్నారట.