Begin typing your search above and press return to search.

వర్జినిటీపై రాజ్ త‌రుణ్.. హీరోయిన్ తో రిలేషన్ పై క్లారిటీ!

By:  Tupaki Desk   |   4 April 2021 11:30 AM GMT
వర్జినిటీపై రాజ్ త‌రుణ్.. హీరోయిన్ తో రిలేషన్ పై క్లారిటీ!
X
‘ఉయ్యాల‌.. జంపాల‌’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు రాజ్ తరుణ్. హీరోయిన్ గా నటించిన అవికా గోర్ తో రాజ్ తరుణ్ కెమిస్ట్రీ అద్దిరిపోయింది. ఆ త‌ర్వాత ‘సినిమా చూపిస్త మావ‌’తో కాంబో రిపీట్ చేసిన వీరిద్దరూ సక్సెస్ ను కూడా రిపీట్ చేశారు. దీంతో.. వీళ్ల పెయిర్ మంచి ఇంప్రెషన్ కొట్టేసింది. ఆ తర్వాత వీళ్లిద్దరి నుంచీ సినిమా రాలేదు.

తర్వాత రాజ్ తరుణ్ కూడా చాలా సినిమాల్లో చేశాడు. కానీ.. సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు. ఇటీవల ‘పవర్ ప్లే’ అంటూ వచ్చినప్పటికీ.. విజయం మాత్రం దక్కలేదు. అయితే.. ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియా వేదికగా టచ్ లోనే ఉంటాడీ హీరో. తన సినిమా విశేషాలను ఫ్యాన్స్ కు తెలియజేస్తూ.. వారితో ముచ్చటిస్తూ ఉంటాడు.

తాజాగా.. త‌న ఫాలోవ‌ర్లో ముచ్చ‌టించాడు. వాళ్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన స్టైల్లో సమాధానాలు ఇచ్చారు. ఇందులో ప్ర‌ధానంగా పెళ్లి, గ‌ర్ల్ ఫ్రెండ్ గురించి అడిగితే.. స్ట్ర‌యిట్ గా స‌మాధానం చెప్ప‌లేదీ హీరో. అబ్బే.. అలాంటివి లేవంటూ త‌ప్పించుకున్నాడు. త‌న అప్ క‌మింగ్ సినిమాల వివ‌రాలు కూడా తెలియ‌జేశాడు.

కాగా.. వ‌కీల్ సాబ్ ట్రైల‌ర్ తో ఫేమ‌స్ అయిన ‘ఆర్ యూ వ‌ర్జిన్‌’ డైలాగ్ ను విపరీతంగా వాడేస్తున్నారు నెటిజన్లు. మొన్న నాగబాబుకు కూడా ఈ ప్రశ్న వేయగా.. ఇవాళ రాజ్ తరుణ్ కు వేశారు. దీనికి కూడా సరైన సమాధానం చెప్పలేదు రాజ్. నా గురించి మీరేమని అనుకుంటున్నారు? అంటూ ఎదురు ప్ర‌శ్న వేశాడు.

ఇక‌, త‌న గ‌త హీరోయిన్లు అవికా గోర్‌, హెబ్బా ప‌టేల్ తో మ‌ళ్లీ సినిమా ఎప్పుడు వ‌స్తుంద‌ని అడిగిన ప్ర‌శ్న‌కు త్వ‌ర‌లోనే వ‌స్తుంద‌ని చెప్పాడు. అయితే.. అవికా గోర్ తో మీ రిలేష‌న్ ఏంట‌న్న ప్ర‌శ్న‌కు.. త‌న‌కు నాకు బెస్ట్ ఫ్రెండ్ అని స‌మాధానం ఇచ్చాడు రాజ్ త‌రుణ్‌.