Begin typing your search above and press return to search.

కుర్ర హీరోకు పిచ్చి పాత్ర?

By:  Tupaki Desk   |   29 Jan 2019 5:54 AM GMT
కుర్ర హీరోకు పిచ్చి పాత్ర?
X
కుమారి 21 ఎఫ్ టైంలో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుని వరస సక్సెస్ లతో జోష్ మీద కనిపించిన కుర్ర హీరో రాజ్ తరుణ్ ఈ మధ్య బాగా డిఫెన్స్ లో పడిపోయాడు. రెండేళ్ళలో ఐదు పరాజయాలు అంటే మాటలా. అందుకే దాని ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. కథల ఎంపికలో ఏ నిర్ణయం తీసుకోలేక మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు వేణు అనే డెబ్యు డైరెక్టర్ రాజ్ తరుణ్ కు ఓ కథను విన్పించాడట.

పిచ్చి పాలనకు మారుపేరైన మహమ్మద్ బిన్ తుగ్లక్ మళ్ళి బ్రతికి వచ్చి హీరో శరీరంలోకి ప్రవేశించి వర్తమాన రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్ మీద కామెడీ ప్లస్ సెటైర్లు రెండు సమపాళ్ళలో మిక్స్ చేసి వేణు ఇది రాసుకున్నాడట. పేపర్ మీద బ్రహ్మాండంగా కనిపిస్తున్న ఈ థీమ్ తనలాంటి యూత్ హీరోకు ఎంత వరకు సెట్ అవుతుందని రాజ్ తరుణ్ రకరకాల కోణాల్లో ఆలోచించడం వల్ల ఆలస్యం అవుతోందని టాక్.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్ తరుణ్ రొటీన్ లవ్ స్టోరీస్ చేయడం కంటే కాస్త వైవిధ్యం ఉన్న ఇలాంటి బ్యాక్ డ్రాప్స్ ని ఎంచుకోవడం బెటర్. రిస్క్ ఉన్న మాట వాస్తవమే కాని పరిశ్రమలో పోటీ ఎక్కువైపోయి ప్రేక్షకులు కంటెంట్ కి మాత్రమే ఓటు వేసే పరిస్థితులు వచ్చేసాయి. హీరోలు ఎవరు అనేది అసలు పట్టించుకోవడం లేదు. ఈ నేపధ్యంలో రాజ్ తరుణ్ రిస్క్ తీసుకోవడమే సేఫ్ గేమ్ అవుతుంది. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని మరో నెల రోజుల్లోనే తీసుకోవాల్సి ఉంటుంది. లవర్ వచ్చి చాలా నెలలైంది. జనాలు మర్చిపోక ముందే రాజ్ తరుణ్ కాస్త తొందపడితే బెటర్