Begin typing your search above and press return to search.

రాజ్ తరుణ్ న్యూ స్టైల్ కి కారణం అతనే

By:  Tupaki Desk   |   4 July 2018 6:03 AM GMT
రాజ్ తరుణ్ న్యూ స్టైల్ కి కారణం అతనే
X
టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ మొదట్లో అందుకున్న విజయాలను ఇప్పుడు అందుకోవడం లేదు. ఒక్క హిట్టు కొట్టి మళ్ళీ తన క్రేజ్ పెంచుకోవాలని చూస్తున్నాడు. వరుసగా ఎన్ని సినిమాలు చేస్తున్నప్పటికీ మనోడి లక్కు మారడం లేదు. అయితే నెక్స్ట్ అతను భారీ హోప్స్ పెట్టుకున్న చిత్రం లవర్. అనీష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఏ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు నిర్మించాడు.

అయితే ఈ సినిమాలో రాజ్ తరుణ్ రెగ్యులర్ స్టైల్ లో కాకుండా కాస్త కొత్తగా కనిపిస్తాడట. లుక్ లో మార్పు రావడానికి యువ నిర్మాత హర్షిత్ ముఖ్యకారణమని రాజ్ తరుణ్ అంటున్నాడు. సినిమా మొదటి నుంచి తన లుక్ కోసం హర్షిత్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారని ఇంత మంచి సినిమాను తనతో తీసినందుకు అనీష్ కృష్ణకు కూడా చాలా కృతజ్ఞతలని ఈ యువ హీరో వివరించాడు. అదే విధంగా కథానాయిక రిద్ధి కుమార్ కూడా చాలా కష్టపడి నటించిందని సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుందని కూడా రాజ్ తరుణ్ తెలిపాడు.

లవర్ సినిమా జులై 20న రిలీజ్ కాబోతోంది. హర్షిత్ నిర్మాత అయినప్పటికీ దిల్ రాజు సినిమా గురించి ఎప్పటికప్పుడు తెలుసుకొని బ్యాక్ గ్రౌండ్ గా నిలిచారట. మరి వరుస అపజయాలతో సతమతమవుతున్న రాజ్ తరుణ్ కి లవర్ సినిమా ఎంతవరకు విజయాన్ని అందిస్తుందో చూడాలి.