Begin typing your search above and press return to search.
లాస్యతో లేచిపోయి వస్తే పెళ్లి చేస్తామన్నారట!!
By: Tupaki Desk | 13 March 2017 8:25 AM GMTటాలీవుడ్లో ఈ మధ్య కాలంలో వచ్చిన రూమర్లలో హీరో రాజ్ తరుణ్.. యాంకర్ లాస్య పెళ్లి చేసుకున్నారన్న న్యూసే చాలా చిత్రమైంది. వీళ్లిద్దరికీ ఎలా లంకె కుదిరిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఐతే ఇద్దరూ క్లోజ్ గా కనిపించిన ఒక ఫొటో చూసి.. అలాగే నిప్పు లేనిదే పొగ రాదు కదా అనే లాజిక్ ప్రకారం ఆలోచించి జనాలు ఇది నిజమే అనుకున్నారు. కానీ ఇదంతా శుద్ధ అబద్ధమని రాజ్ తరుణ్.. లాస్య ఇద్దరూ కూడా కన్ఫమ్ చేశారు. లాస్య ఈ మధ్యే అసలేం జరిగిందో క్లియర్ గా చెప్పింది. ఓ ఆడియో వేడుకలో తీసిన సెల్ఫీలోంచి నటుడు నోయల్ ను తప్పించి.. తమ ఇద్దరినీ మాత్రమే పెట్టి ఇలా దుష్ప్రచారం చేశారని ఆమె చెప్పింది.
తాజాగా రాజ్ తరుణ్ కూడా ఈ వ్యవహారానికి సంబంధించి తన వివరణ ఇచ్చాడు. లాస్యతో పెళ్లి అనే రూమర్ బయటికి వచ్చినపుడు తాను ఎంత ఇబ్బంది పడిందీ వివరించాడు. ఆ సమయంలో తన స్నేహితులు కూడా ఈ రూమర్ నిజమని నమ్మి.. తనకు ఫోన్ చేసినట్లు రాజ్ తరుణ్ తెలిపాడు. లాస్యతో లేచిపోయి వస్తే పెళ్లికి తాము సాయం చేస్తామని కూడా కొందరు స్నేహితులు ఫోన్ చేసినట్లు అతను వివరించాడు. అందరికీ ఈ వార్త అబద్ధమని అర్థమయ్యేలా చెప్పడానికి చాలా ఇబ్బందయిందని రాజ్ తరుణ్ అన్నాడు. ఈ వార్త నిప్పు లేకుండా వచ్చిన పొగ లాంటిదని రాజ్ తరుణ్ వివరించాడు. లాస్యను తాను ఒక్కసారి మాత్రమే.. ‘కుమారి 21 ఎఫ్’ ఆడియో వేడుకలో కలిశానని.. అంతకుమించి తమ మధ్య ఏమీ లేదని రాజ్ తరుణ్ తెలిపాడు.ఆ వేడుకలో తీసిన సెల్ఫీనే ఈ ప్రచారానికి కారణమైందని అతను చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/