Begin typing your search above and press return to search.

సునీల్, బన్నీ కోసం రాజ్ తరుణ్ కథలు

By:  Tupaki Desk   |   17 Nov 2015 11:30 AM GMT
సునీల్, బన్నీ కోసం రాజ్ తరుణ్ కథలు
X
డైరెక్టర్ అవ్వాలని వచ్చి.. ఆ డిపార్ట్ మెంట్ లో పని కూడా చేసి.. ఆ తర్వాత హీరోలుగా మారిన అతి కొద్ది మంది కథానాయకుల్లో రాజ్ తరుణ్ ఒకడు. ఇంతకుముందు రవితేజ - నాని లాగే రాజ్ కూడా ముందు డైరెక్టర్ కావాలని కలలు కన్నవాడే. కొన్ని సినిమాలకు పని చేశాడు కూడా. ఆ తర్వాత అనుకోకుండా ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరో అయిపోయాడు. ఐతే ఆ సినిమా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో కూడా రాజ్ హ్యాండ్ ఉంది. మాటలు రాయడంతో పాటు స్క్రీన్ ప్లే సహకారం కూడా అందించాడు. కాబట్టి భవిష్యత్తులో ఈ గోదారి కుర్రాడు డైరెక్టర్ అయినా ఆశ్చర్యమేమీ లేదు.

ఐతే రాజ్ కూడా ఈ విషయంలో ఏమీ దాచడం లేదు. సునీల్ - అల్లు అర్జున్ లను దృష్టిలో ఉంచుకుని కథలు కూడా రాస్తున్నట్లు వెల్లడించాడు. ‘‘నాకు ఖాళీ ఉన్నపుడు కథలు రాస్తుంటాను. సునీల్ గారిని, బన్నీ గారిని మనసులో పెట్టుకుని కథలు కూడా రాశాను. సునీల్ భయ్యాను కలిసినపుడు కథల గురించి డిస్కస్ చేస్తుంటాను. ఆయన కూడా మంచి కథ ఉంటే నువ్వే డైరెక్ట్ చెయ్యి అని చెప్పారు కూడా. కానీ నేనే ఇంకా సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పటిదాకా ఎవరికీ కథ చెప్పలేదు. భవిష్యత్తులో డైరెక్షన్ చేస్తానో లేదో చెప్పలేను. నటుడిగా ఫుల్ బిజీగా ఉన్నాను’’ అని రాజ్ చెప్పాడు.