Begin typing your search above and press return to search.
రాజ్ తరుణ్ మళ్లీ పుంజుకుంటాడా?
By: Tupaki Desk | 12 Aug 2019 4:18 AM GMTకెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలు అందుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ ఆ తర్వాత డీలా పడ్డాడు. ఇక మొన్న దిల్ రాజు బ్యానర్ లో చేసిన లవర్ కూడా డిజాస్టర్ అయింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత కొన్ని నెలలు బ్రేక్ తీసుకున్నాడు. అయితే ఆ గ్యాప్ లో కొన్ని మంచి కథలు ఎంచుకున్నాడట. ఆ సమయంలో దాదాపు పది కథలు విన్నాడట ఈ కుర్ర హీరో. అందులో 'ఇద్దరి లోకం ఒకటే' కథ బాగా నచ్చడంతో ముందుగా అదే చేస్తున్నాడు.
ప్రస్తుతం 'ఇద్దరిలోకం ఒకటే' షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆ మధ్య సుధీర్ బాబుతో 'ఆడు మగాడ్రా బుజ్జి' సినిమాను తీసిన దర్శకుడు జి.ఆర్.కృష్ణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 'అర్జున్ రెడ్డి' బ్యూటీ షాలిని పాండే హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు.
ఈ సినిమా రిలీజ్ అవ్వగానే విజయ్ కుమార్ కొండ సినిమాను స్టార్ట్ చేస్తాడు రాజ్ తరుణ్. అదే సమయంలో అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లో నాగార్జున నిర్మాతగా మరో సినిమా చేస్తాడని తెలుస్తుంది. మారుతి నిర్మాణంలో కూడా ఒకటి చేయాల్సి ఉంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ తో రాజ్ తరుణ్ మళ్లీ పుంజుకోవడం ఖాయమనిపిస్తుంది. మరి ఈ సినిమాలతో కుర్ర హీరో ఎలాంటి హిట్స్ సాదిస్తాడో చూడాలి.