Begin typing your search above and press return to search.
మల్లూ బ్యూటీకి లిప్ లాక్ ఇచ్చేశాడట
By: Tupaki Desk | 3 Feb 2017 5:46 AM GMTనానికి హీరోయిన్ గా మజ్ను మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ అను ఇమాన్యుయేల్. తెలుగు.. తమిళ్.. మలయాళ భాషల్లో మార్కెట్ పెంచుకునేందుకు తెగ జోరు చూపిస్తున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. వీటిలో ఒకటి కుర్ర హీరో రాజ్ తరుణ్ తో చేస్తున్న కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త.
పూర్తిగా ఫన్ జోనర్ లో సాగనున్న ఈ చిత్రం.. ఇప్పటికే టీజర్ ద్వారా ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అంచనాలు పెరిగేలా చేసింది. అయితే.. సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిన సమయంలో.. రషెస్ చూసుకుంటే దర్శకుడికి ఇందులో ఫన్ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా బాగానే కనిపించాయట. కానీ రొమాన్స్ జోనర్ మాత్రం అంత ఎక్కువగా లేదనే ఫీలింగ్ కలిగిందట. అందుకే.. కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్తలో ఓ లిప్ లాక్ సీన్ ను ఏర్పాటు చేసి ఇదే విషయాన్ని హీరో హీరోయిన్స్ ఇద్దరికీ చెప్పాడట దర్శకుడు వంశీకృష్ణ.
అటు రాజ్ తరుణ్ కానీ.. ఇటు అను ఇమాన్యుయేల్ కానీ అబ్జెక్షన్ చెప్పకపోవడంతో.. ఇప్పటికే లిప్ లాక్ సీన్ ను ఘాటుగా ఉండేలా తెరకెక్కించేశారట. ఇప్పటికే మల్లూ బ్యూటీలకు టాలీవుడ్ లో తెగ డిమాండ్ ఉంది. ఇప్పుడు లిప్ టు కిస్ లకు అను సై అనేయడంతో.. అవకాశాలు మరింతగా పెరుగుతాయంటున్నారు టాలీవుడ్ జనాలు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/