Begin typing your search above and press return to search.
కుర్రాడి స్పీడ్ తగ్గటం లేదు
By: Tupaki Desk | 20 May 2018 10:32 AM GMTఉయ్యాల జంపాలతో పరిచయం లేని నటుడిగా వచ్చిన రాజ్ తరుణ్ తక్కువ టైంలోనే యూత్ హీరోగా రిజిస్టర్ అయ్యాడు. కుమారి 21 ఎఫ్ తో సక్సెస్ గ్రాఫ్ అమాంతం పెంచేసుకున్న రాజ్ తరుణ్ కు టైం ఈ మధ్య ఏమంత కలిసి రావడం లేదు. కిట్టు ఉన్నాడు జాగ్రత్త-అంధగాడు-రంగుల రాట్నం వరసగా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. జూన్ 1 విడుదల కానున్న రాజుగాడు మీద రాజ్ తరుణ్ అంచనాలు మామూలుగా లేవు. ఇప్పటికే ట్రైలర్ తో పాటు ఆడియో కూడా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకోవడంతో బిజినెస్ కూడా బాగా జరిగింది. సరే గ్రాఫ్ కొంచెం అటుఇటుగా ఉన్నా కూడా కుర్రాడి స్పీడ్ లో మాత్రం మార్పు లేదు. వరసగా సినిమాలు లైన్ లో పెట్టేస్తూ ఖాళీ లేకుండా చూసుకుంటున్నాడు. రాజుగాడు తర్వాత దిల్ రాజు నిర్మాణంలో లవర్ కూడా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.
వీటితో పాటు సి.కళ్యాణ్ నిర్మాతగా మరో సినిమా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ ఏడాది బాలకృష్ణతో జైసింహ లాంటి కమర్షియల్ హిట్ తీసిన కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ తో తీసిన ఇంటెలిజెంట్ ఫలితం మాత్రం తేడా కొట్టింది. ప్రస్తుతం వివి వినాయక్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా రూపొందే కొత్త సినిమని ఈ నెల చివరి వారం నుంచే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. కన్నడ మఫ్టీ రీమేక్ గా ఇది రూపొందనున్నట్టు సమాచారం. దానితో సమాంతరంగా రాజ్ తరుణ్ సినిమాని తీసే ప్రయత్నాల్లో ఉన్నట్టు వినికిడి. దర్శకుడి ఎవరు అనే దాని గురించి కూడా ప్రస్తుతానికి సమాచారం లేదు. వీటిలో ఏ ఒక్కటి సూపర్ హిట్ అయినా రాజ్ తరుణ్ మార్కెట్ మళ్ళీ పుంజుకుంటుంది. తక్కువ బడ్జెట్ లో నిర్మాతకు వీలైనంత రిస్క్ లేకుండా చూసుకునే రాజ్ తరుణ్ సినిమాలకు ఈ కారణంగానే ఫలితం ఎలా వచ్చినా నష్టాల శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి వేగంగా షూటింగ్స్ పూర్తి చేసుకోవడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు.