Begin typing your search above and press return to search.
రాజుగాడు తరువాత ఏంటి రాజ్?
By: Tupaki Desk | 1 May 2018 1:30 AM GMTషార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినిమా అవకాశాలు అందుకొని ఎలాంటి సపోర్ట్ లేకుండా కష్టపడి పైకొచ్చిన హీరో రాజ్ తరుణ్. మొదటి సినిమా ఉయ్యాలా జంపాల అందరికి కనెక్ట్ అవ్వడంతో రాజ్ తరుణ్ కి చాలా ఫాస్ట్ గా స్టార్ డమ్ వచ్చేసింది. పైగా వరుసగా హిట్స్ అందడం మనోడికి కలిసొచ్చింది. ఇంత వరకు ఏ హీరో అందుకొని క్రేజ్ ను చాలా స్పీడ్ గా అందుకున్న ఈ యువ హీరో అంతే స్పీడ్ గా మళ్లీ డౌన్ అయ్యాడు.
రాజ్ తరుణ్ గత కొంత కాలంగా చేస్తోన్న సినిమాలు పెద్దగా హిట్ అవ్వడం లేదు. చివరగా వచ్చిన రంగుల రాట్నం యావరేజ్ గానే నిలిచింది. ఇక నెక్స్ట్ రాజు గాడు అనే సినిమాతో ఈ హీరో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లవ్ - కామెడీ ప్లస్ యాక్షన్ తరహాలో సినిమా చాలా బాగా వచ్చిందని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది. రాజ్ తరుణ్ కూడా సినిమాపై నమ్మకం ఉందని చెప్పాడు. అయితే ఈ సినిమా తరువాత రాజ్ తరుణ్ తరువాత ప్రాజెక్ట్ ను ఫైనల్ చేయలేదు.
రెండు కథలు క్యూ లో ఉన్నాయని టాక్ వస్తున్నా అధికారికంగా ఎలాంటి న్యూస్ లేదు. మరి నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి. ఇక రాజుగాడు సినిమా ద్వారా సంజన రెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. రాజ్ తరుణ్ తో ఇంతకుముందు రెండు సినిమాలను నిర్మించిన ఏకే ఎంటర్టైన్మెంట్స్ రాజుగాడు సినిమాను నిర్మిస్తోంది. ఇక హీరోయిన్ గా అమైరా దస్తూర్ నటించింది.