Begin typing your search above and press return to search.
ఉయ్యాల జంపాల.. ఛాన్స్ ఎలా కొట్టాడు?
By: Tupaki Desk | 13 Dec 2015 8:53 AM GMTప్రస్తుతం టాలీవుడ్ ట్రెండు చూస్తే.. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా హీరో కావడం అన్నది అసాధ్యమైన విషయంలా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సోలోగా పైకి వచ్చిన హీరో రాజ్ తరుణ్. బ్యాగ్రౌండ్ ఏమీ లేకుండా హీరో కావడమే కాదు.. వరుసగా మూడు హిట్లు కొట్టి ఔరా అనిపించాడు రాజ్. ఇంతకీ అతడికి తొలి అవకాశం ఎలా వచ్చింది? అతడెలా హీరో అయ్యాడు? అతడి బ్యాగ్రౌండ్ ఏంటి? తన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘మాది వైజాగ్. చిన్నప్పట్నుంచి సినిమాలంటే పిచ్చి విపరీతంగా సినిమాలు చూసేవాణ్ని. దర్శకుడవుదామన్న కోరికతో లఘుచిత్రాలు తీయడం మొదలుపెట్టా. 55కు పైగా షార్ట్ ఫిలిమ్స్ తీశా. నా ప్రయత్నం వృథా పోలేదు. నిర్మాత రామ్మోహన్ నా ఫేస్ బుక్ పేజీలో ఓ మెసేజ్ పెట్టారు. ‘షార్ట్ ఫిలిమ్స్ బాగా చేస్తున్నావు. హైదరాబాద్ వచ్చి కలువు’ అన్నారు. మా బంధువుల్లో ఒకరిది గృహ ప్రవేశం ఉండటంతో ఆ సాకుతో హైదరాబాద్ వచ్చాను. నేను వైజాగ్ వదిలి రావడం అదే తొలిసారి. రామ్మోహన్ గారిని కలిస్తే నటిస్తావా, దర్శకత్వం చేస్తావా అని అడిగారు. దర్శకత్వమే అన్నా. విరించి వర్మను పిలిచి కథ చెప్పమన్నారు. అది విన్నాక రెండో సగం ఇంకా బాగా చేయాలి అన్నాను. ఆ బాధ్యత నాకే అప్పగించారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాను. హీరో పాత్ర కోసం నేనే దగ్గరుండి ఆడిషన్స్ చేశాను. రామ్మోహన్ గారికి ఎవరూ నచ్చలేదు. నన్నే హీరోగా అడిగారు. చేస్తానని చెప్పా. ముందు కుదరదన్నావుగా అని రామ్మోహన్ గారు అడిగితే.. ‘ఇంత పెద్ద సినిమా అవుతుందని అనుకోలేదు’ అని బదులిచ్చా’’ అంటూ ‘ఉయ్యాల జంపాల’ రోజుల్ని గుర్తు చేసుకున్నాడు రాజ్.