Begin typing your search above and press return to search.
నాలుగోది కొడితే కొత్త కుర్రాడిది చరిత్రే
By: Tupaki Desk | 23 Jan 2016 11:30 AM GMTహ్యాట్రిక్ హీరో రాజ్ తరుణ్ ఇప్పుడు మరో హ్యాట్రిక్ కి రెడీ అవుతున్నాడు. మరో వారం రోజుల్లో ఈ కుర్ర హీరో నటించిన సీతమ్మ అందాలు, రామయ్య సిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇది కూడా హిట్ అయితే మాత్రం.. టాలీవుడ్ లో రాజ్ తరుణ్ కొత్త చరిత్ర సృష్టించేస్తాడు. ఎందుకంటే ఇప్పటివరకూ ఏ హీరోకి వరుసగా మూడు హిట్స్ కొట్టిన చరిత్ర లేదు. అలా ఓ హిస్టరీ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్న రాజ్ తరుణ్.. ఆ ఘనత సాధిస్తాడో లేదో తెలియాలంటే మాత్రం మరో ఆర్రోజలు ఆగాలి. ప్రస్తుతం కోటి రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక కొత్త హీరో రాజ్ తరుణ్ ఒక్కడే కావడం విశేషం.
- ఇంత సక్సెస్ ఫుల్ హీరో అవుతానని అనుకున్నారా?
అసలు నేను హీరో అవుతాననే అనుకోలేదు. నేను డైరెక్టర్ కావాలని అనుకున్నాను. షార్ట్ ఫిలింస్ తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేసేవాడిని. ఇప్పటివరకూ 52 షార్ట్ ఫిలింస్ తీశాను.
- హీరోగా ఆఫర్ ఎలా వచ్చింది?
హీరోయిన్ కోసం ఓ సారి ఆడిషన్ చేస్తున్నాం. దాదాపు 30 మంది అమ్మాయిలను ఆడిషన్ చేశాం. కానీ నిర్మాతకు ఎవరూ నచ్చలేదు. చివరకు నన్ను సెలెక్ట్ చేసి ఆడిషన్ క్లోజ్ చేశారు.(నవ్వుతూ) నన్ను సెలెక్ట్ చేసేసుకున్నారని నాకు తెలీదు. నేను వేరే అబ్బాయిల ఫోటోల చూపించాను. చివరకు నాకు ఆఫర్ వచ్చింది
- మొదటి మూవీ హిట్ అయ్యాక ప్రశంసలకు ఎలా ఫీలయ్యారు?
ఫస్ట్ మూవీ హిట్ తర్వాత నాగ్ సార్ ని కలిశాను. ఆయన చాలా చెప్పారు కానీ, నాకు అవేవీ వినపడలేదు. నా బ్రెయిన్ అప్పటికే సంతోషంతో నిండిపోయింది. సురేష్ బాబు కూడా అభినందించారు.
- రెండో సినిమా ఆఫర్ గురించి..
ఉయ్యాలా జంపాలా తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ అప్పటికి నా వయసు 21. అందుకే నాకు సరిపోయే పాత్రల కోసం ఎదురు చూశాను. ఎంతో ఆలోచించాక సినిమా చూపిస్త మావా ను యాక్సెప్ట్ చేశాను.
- ఎవరి సలహాలైనా తీసుకుంటారా?
నేను నా సొంత జడ్జిమెంట్ నే నమ్ముతాను. సలహాలు అడగను. అదృష్టం కొద్దీ నేను తీసుకున్న నిర్ణయాలు సక్సెస్ అయ్యాయి.
-కుమారి21లో ఆఫర్ గురించి..
సుకుమార్ గారు ఫోన్ చేసి పిలిచారు. 20 నిమిషాల పాటు స్టోరీ గురించి ఎక్స్ ప్లెయిన్ చేశారు. ఇదో డిఫరెంట్ సబ్జెక్ట్ అని అర్దమైంది. వెంటనే ఒప్పేసుకున్నాను
- వరుస సక్సెస్ ల తర్వాత ఏం మార్పు వచ్చింది
విజయం తర్వాత బాధ్యత పెరుగుతుంది. కానీ నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. దీనికి కారణం నేను ప్రాక్టికల్ గా ఉంటాను.
- ఇంటస్ట్రీలో పోటీ ఎలా ఉంది?
నేను స్టార్ హీరోల వారసులకు పోటీ అని నేను అనుకోవడం లేదు. వాళ్లలో నేను చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతాను. మంచి బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే సినిమా ఆఫర్స్ వస్తాయనే విషయాన్ని నేను నమ్మను.
- సినిమా షూటింగ్ లేనపుడు ఏం చేస్తారు?
నేను చాలా బోరింగ్ వ్యక్తిని. పార్టీలకు వెళ్లడం అంతగా నచ్చదు. షూటింగ్ లేకపోతే సినిమాలు చూడ్డమో, నిద్రపోవడమో చేస్తాను. నాకు 9 కుక్కలు ఉన్నాయి. వాటితో టైం స్పెండ్ చేస్తాను
- రాబోయే ప్రాజెక్టుల గురించి
ఇప్పుడు రాబోతున్న సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు కాకుండా, మంచు విష్ణుతో మల్టీస్టారర్ చేస్తున్నా. ఇది దాదాపు పూర్తి కావచ్చింది. గీతా ఆర్ట్స్ తో ఒకటి, దిల్ రాజు బ్యానర్ లో ఒకటి ఫైనలైజ్ కావాల్సి ఉంది.