Begin typing your search above and press return to search.
స్నేహితుడికి మాటిచ్చా.. నిలబెట్టుకుంటున్నా
By: Tupaki Desk | 11 Dec 2015 5:26 AM GMTరాజ్ తరుణ్ .. హ్యాట్రిక్ హీరోగా తెరపైకి దూసుకొచ్చాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం సక్సెస్ తో స్టార్ డమ్ ని విస్తరించడం సాధ్యమేనని నిరూపించిన హీరో. కోటి పైగా పారితోషికం అందుకుంటున్నాడన్న టాక్ నడుస్తోందిప్పుడు. అయితే ఓ సామాన్యుడికి ఇదెలా సాధ్యం అన్న కన్ఫ్యూజన్ లో ఉందీ ప్రపంచం. అందరూ కన్ఫ్యూజన్ నుంచి బైటికి రాకముందే వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు ఈ కుర్రహీరో.
ఉయ్యాల జంపాల - సినిమా చూపిస్త మావ - కుమారి 21 ఎఫ్ సినిమాలతో వరుస విజయాలు అందుకుని తదుపరి సినిమాలో నటించేస్తున్నాడు. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తాజా సినిమా తెరకెక్కుతోంది. అసలు ఈ ప్రాజెక్టు ఎలా మెటీరియలైజ్ అయ్యింది? అన్న ప్రశ్నకు రాజ్ తరుణ్ చెప్పిన సమాధానం ఇంట్రెస్టింగ్. ఈ చిత్ర దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి నా స్నేహితుడు. ఉయ్యాల జంపాల సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆ సినిమా టైమ్ లోనే నా స్నేహితుడికి ప్రామిస్ చేశాను. తనతో సినిమా చేస్తానని మాటిచ్చాను. నాకు కథ కూడా చెప్పాడు. కేవలం నన్ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథ ఇది. కె.వి.శ్రీధర్ రెడ్డి - శైలేంద్రబాబు నిర్మాతలుగా ఈ సినిమాని సెట్స్ కి తీసుకెళ్లాం... అని చెప్పాడు.
స్నేహానికి విలువిచ్చిన గొప్ప స్నేహితుడు రాజ్ తరుణ్. అది సంగతి.