Begin typing your search above and press return to search.
ఇక చిన్న సినిమాలకు మనోడే ఛత్రపతి
By: Tupaki Desk | 8 Oct 2015 10:30 PM GMTలో బడ్జెట్ మూవీస్.. వీటితో ఎంత రిటర్న్ ఉంటుందో అంతే రిస్క్ కూడా ఉంటుంది. సరైన హీరో లేకపోతే మొత్తం పెట్టుబడికే ఎసరొచ్చే ప్రమాదం ఉంటుంది. రిటర్న్స్ వస్తే మాత్రం కొన్ని రెట్లు సంపాదించేసుకోవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ లో చిన్న సినిమాలకు సరైన హీరో అనిపించుకునే వాళ్ల సంఖ్య తక్కువగానే ఉంది. ఈ జాబితాలో స్టార్ గా ఎదిగిపోయాడు రాజ్ తరుణ్. ఉయ్యాలా జంపాలా - సినిమా చూపిస్త మావాల సక్సెస్ ఈ కుర్రాడిని ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టాయి.
వీటితోపాటు ఇప్పుడు సుకుమార్ నిర్మాణంలో వస్తున్న కుమారి 21 ఎఫ్ కూడా.. ఇండస్ట్రీలో బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం రాజ్ తరుణ్ కి వరుస ఛాన్సులు వస్తున్నాయి. వంశీ డైరెక్షన్ లో వస్తున్న లేడీస్ టైలర్ సీక్వెల్.. ఫ్యాషన్ డిజైనర్ లో రాజ్ తరుణ్ నే హీరోగా ఎంచుకున్నారు. చిన్న సినిమాలకు రాజమౌళిగా ఎదిగాడనే ప్రశంసలు పొందుతున్న మారుతీ.. గీతాఆర్ట్స్2 బ్యానర్ పై తర్వాత చేయబోతున్న మూవీకి కూడా ఇతగాడినే తీసుకున్నారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ ఒక్కో మూవీకి దాదాపు 60 లక్షలు తీసుకుంటున్నాడట. ఇంతగా డిమాండ్ చేస్తున్నా.. ఆఫర్స్ ఇవ్వడంలో మేకర్స్ ఏమాత్రం తగ్గకపోవడానికి కారణం.. చిన్న చిత్రాలను నడిపించగల సత్తా ఉన్న హీరోగా రాజ్ తరుణ్ ఎదగడమే.
ఇకపోతే అసలు ఇలాంటి సక్సెస్ ఫుల్ యంగ్ హీరోల లీగుల్లో ఇప్పుడు హీరోలే లేరు. వరుణ్ సందేశ్ - తనిష్ అవుట్ డేటెడ్ అవ్వగా.. నిఖిల్ మాత్రం తనకంటే పై లీగ్ కు వెళ్లిపోయాడు. సో.. ఖచ్చితంగా మనోడు ఒక్కడే అందరికీ ఆప్షన్. అది సంగతి.