Begin typing your search above and press return to search.

లవర్ బాయ్ కోసం మరో ఫ్లాప్ వెయిటింగ్?

By:  Tupaki Desk   |   12 Feb 2020 2:30 AM GMT
లవర్ బాయ్ కోసం మరో ఫ్లాప్ వెయిటింగ్?
X
యువహీరో రాజ్ తరుణ్ కెరీర్ అద్భుతంగా హ్యాట్రిక్ హిట్లతో ప్రారంభమైంది కానీ తర్వాత మాత్రం గ్రాఫ్ దిగజారుతూనే ఉంది. వరస ఫ్లాపులతో ఒక దశలో రాజ్ తరుణ్ గ్యాప్ కూడా తీసుకున్నాడు. అయినా ఇప్పటికీ రాజ్ తరుణ్ కు హిట్ దక్కలేదు. రాజ్ తరుణ్ నటించిన చివరి మూడు సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి ఫ్లాపులు. 'రాజుగాడు'.. 'లవర్'.. 'ఇద్దరిలోకం ఒకటే' డిజాస్టర్లు కావడంతో రాజ్ తరుణ్ క్రేజ్ దాదాపుగా తగ్గిపోయింది. అయితే రాజ్ తరుణ్ మాత్రం తన కొత్త సినిమా 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ నిన్నే రిలీజ్ అయింది. కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ కు సోషల్ మీడియాలో రెస్పాన్స్ నెగెటివ్ గా ఉంది. పోస్టర్ డిజైన్ మరీ బీసీ కాలం నాటిదిగా ఉందని.. హీరోయిన్ హీరోను వేధించే ఆ కాన్సెప్ట్ కూడా కొత్తది కాదని సెటైర్లు పడుతున్నాయి. ఇది మరో ఫ్లాప్ పోస్టర్ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

అసలే వరస ఫ్లాపులతో సతమతమవుతున్న రాజ్ తరుణ్ ఇలాంటి అవుట్ డేటెడ్ కంటెంట్ తో కనుక వస్తే మరో ఫ్లాప్ తప్పదని కొందరు ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. లవర్ బాయ్ ఇమేజ్ ఉందనే మాట వాస్తవమే కానీ ఈతరం ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టుగా కాన్సెప్టులు ఎంచుకుంటేనే హిట్ దక్కే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ 'ఒరేయ్ బుజ్జిగా' రాజ్ తరుణ్ ను ముంచుతుందో.. తేల్చుతుందో వేచి చూడాలి.