Begin typing your search above and press return to search.
ఆరేళ్ల లవ్ ను బయట పెట్టిన యంగ్ హీరో
By: Tupaki Desk | 15 Jun 2019 5:58 AM GMTషార్ట్ ఫిల్మ్స్ నుండి వెండి తెరపైకి వచ్చిన రాజ్ తరుణ్ ప్రేమలో ఉన్నాడట. అది కూడా ఈమద్య ప్రేమలో పడలేదట.. ఏకంగా ఆరు సంవత్సరాల నుండి తాను ప్రేమలోనే ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. తన ప్రేమ విషయం బయటకు రావడం ఇష్టం లేదు.. ఆమె ఎవరు అనే విషయాన్ని చెప్పి ఆమె ప్రైవసీకి భంగం కలిగించడం ఎందుకు అనే ఉద్దేశ్యంతో ఇన్నాళ్లు ప్రేమ విషయాన్ని దాచినట్లుగా చెప్పుకొచ్చాడు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా కూడా ఫుల్ క్లారిటీతో చెప్పేశాడు.
తాజాగా ఒక ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ప్రేమ పెళ్లి విషయాలపై రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ఆరు సంవత్సరాల క్రితం వైజాగ్ లో నా బర్త్ డే వేడుకలో ఆమెను కలవడం జరిగింది. అప్పుడే నా అభిరుచులు ఆమె అభిరుచులు కలిశారు. ఆ తర్వాత ఇద్దరి మద్య స్నేహం బలపడింది.. ఆ స్నేహం ప్రేమగా మారింది. విజయవాడకు చెందిన ఆమె వ్యాపారం నిర్వహిస్తుందని పేర్కొన్నాడు.
ఆమె పేరు.. ఆమె గురించిన మరిన్ని విషయాలను చెప్పేందుకు ఇష్టపడని ఇండస్ట్రీకి ఆమెకు సంబంధం లేదని మాత్రం క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. హీరోగా స్ట్రగుల్ అవుతున్న రాజ్ తరుణ్ కు పెళ్లి అయిన తర్వాత లక్ కలిసి వచ్చి సక్సెస్ లు వస్తాయేమో చూడాలి.