Begin typing your search above and press return to search.
కుర్ర హీరోకి సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దా?
By: Tupaki Desk | 1 Nov 2019 1:30 AM GMTసాదారణంగా సినిమా పరిశ్రమలో ఎక్కువ సెంటిమెంట్స్ మీదే ఆదారపడి ముందుకు సాగుతుంటారు. ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా నెక్స్ట్ సినిమా విషయంలో అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు. తాజాగా రాజ్ తరుణ్ నటిస్తున్న 'ఇద్దరి లోకం ఒకటే' సినిమాను డిసెంబర్ 25 న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తునట్లు ప్రకటించారు.
అయితే ఈ డేట్ కి ఓ సెంటిమెంట్ ఉంది. రాజ్ తరుణ్ మొదటి సినిమా 'ఉయ్యాల జంపాల' కూడా 2013 లో సరిగ్గా ఇదే డేట్ కి రిలీజై సూపర్ హిట్టైంది. చాలా రోజుల తర్వాత వచ్చిన ఓ పల్లెటూరి ప్రేమ కావడంతో అప్పట్లో సంక్రాంతి వరకూ ఆ సినిమా కలెక్షన్స్ రాబట్టింది. అందుకే డిసెంబర్ లో రాజ్ హిట్ సినిమాను దృష్టిలో పెట్టుకొని తన చేతిలో థియేటర్స్ కూడా ఉండటంతో క్రిస్మస్ కి డేట్ లాక్ చేసాడు దిల్ రాజు.
ఇప్పుడు అదే డేట్ కి మరో సూపర్ హిట్ కొట్టి మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నాడు రాజ్. మరి ఈ కుర్ర హీరోకి రిలీజ్ డేట్ సెంటిమెంట్ ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.