Begin typing your search above and press return to search.
సుమా.. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నా!!
By: Tupaki Desk | 20 Dec 2016 3:30 PM GMTశర్వానంద్ కొత్త సినిమా శతమానంభవతి.. సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఆడియో కూడా విడుదలైపోయింది. ఆడియో వేడుకలో జరిగిన ఓ సన్నివేశం.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆడియో రిలీజ్ వేడుకకు హోస్ట్ గా వ్యవహరించిన సుమ.. ఎప్పట్లాగే.. తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ను ఇచ్చింది. మూవీ టైటిల్… పెళ్లితో ముడి పడి ఉండడంతో.. వచ్చిన అతిథులను వారి వివాహానికి సంబంధించి విశేషాలు అడుగుతూ అందరినీ అలరించే ప్రయత్నం చేసింది.
ఇంతలో.. అక్కడికి గెస్ట్ గా వచ్చిన రాజ్ తరుణ్ వంతు వచ్చింది. రాజ్ తరుణ్ ను నీ పెళ్లి ఎప్పుడు.. అని సుమ అడిగేసింది. ఆ వెంటనే.. ఏ మాత్రం తడుముకోకుండా.. మీకు ఇంకా పెళ్లి కాకుండా ఉంటే.. ఆ ఆలోచన ఉండేది..ఇప్పుడే లేదు.. అని సమాధానం చెప్పేశాడు. దీంతో.. సుమతో పాటు.. ఈవెంట్ కు వచ్చిన వాళ్లంతా షాకయ్యారు. ఆ వెంటనే తేరుకున్న సుమ.. ఓకే.. హాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ.. సమాధానం చెప్పి.. రాజ్ తరుణ్ తో టాపిక్ కట్ చేసేసింది.
ఈ సినిమాలో ఓ పాటను రిలీజ్ చేసేందుకు రాజ్ తరుణ్ ను స్టేజ్ పైకి ఆహ్వానించిన సమయంలో.. ఈ సీన్ జరిగింది. కానీ.. పాట రిలీజ్ చేసే విషయం సుమ మరిచిపోవడంతో.. రాజ్ తరుణ్ స్టేజ్ దిగి కిందికి వెళ్లబోయాడు. అంతలోనే విషయం గుర్తొచ్చి.. మళ్లీ అతడ్ని పిలిపించి.. పాట విడుదల చేయించి.. పంపించింది సుమ. దీంతో.. సుమ చాలా తెలివిగా ఇబ్బంది నుంచి తప్పించుకుంది అంటూ .. ఈవెంట్ కు హాజరైన వాళ్లు సరదాగా కామెంట్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/