Begin typing your search above and press return to search.
ఫ్యామిలీతో చేసినట్లుందన్న యంగ్ హీరో
By: Tupaki Desk | 30 May 2018 4:46 AM GMTరాజ్ తరుణ్ గత చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయినా.. ఈ కుర్రాడి మీద టాలీవుడ్ జనాలకు మంచి అంచనాలే ఉన్నాయి. ఫ్యూచర్ లో పెద్ద పెద్ద సినిమాలు కూడా చేస్తాడనే హోప్స్ ఫ్యాన్స్ లో ఉన్నాయి. ఇప్పుడీ యంగ్ హీరో రాజుగాడు అంటూ ఓ ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి.
జూన్ 1న వస్తున్న ఈ చిత్రంలో దొంగతనాలు చేయాలని ఉవ్విళ్లూరే పాత్రలో హీరో కనిపిస్తాడు. రాజుగాడు మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా నిర్వహించారు. తాను ఈ సినిమా చేస్తున్నపుడు అసలు ఓ సినిమా షూటింగ్ లో ఉన్నాననే భావనే రాలేదని.. కుటుంబంతో కలిసి గడుపుతున్నట్లుగా అనిపించిందని చెప్పుకొచ్చాడు రాజ్ తరుణ్. ఇందుకు కారణం.. ఈ సినిమాకు సంబంధించిన అనేక మందితో.. తాను ఇప్పటికే పలుమార్లు యాక్ట్ చేయడమే అన్నాడు రాజ్ తరుణ్. ముఖ్యంగా నిర్మాణ ఏకే ఎంటర్టెయిన్మెంట్ బ్యానర్ పై తనకు ఇది 5వ సినిమా అన్న ఈ హీరో.. ఇక ముందు కూడా తాను ఈ ప్రొడ్యూసర్లకు మూవీస్ చేస్తూనే ఉంటానని అన్నాడు.
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తో ఇది మూడవ సినిమా కాగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజారవీంద్రతో కూడా తాను పలు చిత్రాలు చేసినట్లు చెప్పాడు హీరో. ఇక కమెడియన్ ప్రవీణ్ తో అయితే.. తాను ఎన్ని సినిమాల్లో నటించానో అని లెక్కపెట్టడం కూడా మానేశానని చెప్పి నవ్వులు పూయించాడు ఈ కుర్రాడు. అమైరా దస్తూర్ చాలా అందమైన హీరోయిన్ అన్న రాజ్ తరుణ్.. కొత్త దర్శకురాలు అయినా సంజనా రెడ్డి ఇచ్చి స్వేచ్ఛ కారణంగానే.. తాము ఈ కామెడీ సీన్స్ ఇంతగా పండించామని చెప్పాడు.