Begin typing your search above and press return to search.
'స్టాండప్ రాహుల్' తో ఇంకా డౌన్ అయిన యంగ్ హీరో..!
By: Tupaki Desk | 23 March 2022 2:30 AM GMT'ఉయ్యాల జంపాల' సినిమాతో హీరోగా పరిచయమైన రాజ్ తరుణ్.. మాస్ టచ్ ఉన్న కామెడీ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొన్ని హిట్స్ కూడా అందుకున్నారు. అయితే వరుసగా ప్లాప్ లు రావడంతో.. ట్రాక్ మార్చి విభిన్నమైన సినిమాలు చేశారు.
కొంతకాలంగారాజ్ తరుణ్ ఎలాంటి సినిమాలు చేసినా బాక్సాఫీస్ వద్ద ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఎంత కష్టపడినా ఫలితం మాత్రం దక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ''స్టాండప్ రాహుల్'' అనే కాస్త విభిన్నమైన సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.
స్టాండప్ కమెడియన్ గా కొత్త తరహా పాత్రను ఎంచుకుని లుక్స్ - యాక్టింగ్ పరంగా మేకోవర్ ట్రై చేశాడు యువ హీరో. ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ రావడంతో కచ్చితంగా ఓ వర్గం వారిని మెప్పిస్తుందని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో ఇటీవల థియేటర్ లలోకి వచ్చిన 'స్టాండప్ రాహుల్' సినిమా నిరాశ పరిచింది.
పెద్ద సినిమాల ప్రభావం పడకుండా సరైన డేట్ చూసుకొని 'స్టాండప్ రాహుల్' చిత్రాన్ని రిలీజ్ చేశారు నిర్మాతలు. ఫస్ట్ డేనే మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. టాక్ బాగాలేకపోవడంతో వారాంతంలో కూడా రాణించలేకపోయింది.
జనాలు రాకపోవడంతో థియేటర్ నిర్వహణ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో చాలా చోట్ల సినిమాను తీసేశారు. దీంతో 'పవర్ ప్లే' 'అనుభవించు రాజా' తర్వాత హ్యాట్రిక్ ప్లాప్ గా నిలిచింది. అయితే ఓటీటీ డీల్స్ రూపంలో నిర్మాతలు నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది.
ఏదేమైనా నిలకడ లేకుండా కెరీర్ ను ఈదుతున్న రాజ్ తరుణ్ కు 'స్టాండప్ రాహుల్' సినిమా బూస్టప్ ఇస్తుందని అందరూ ఆశించారు. కానీ ఈ పరాజయం పాలవ్వడమే కాకుండా యువ హీరో మార్కెట్ ని మరింత డౌన్ చేసింది. మరి త్వరలోనే రాజ్ తరుణ్ 'కుమారి 21ఎఫ్' 'సినిమా చూపిస్తా మావా' రేంజ్ సక్సెస్ అందుకొని మళ్లీ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి.