Begin typing your search above and press return to search.

అది నా పర్సనల్‌, చచ్చే వరకు షేర్‌ చేయను

By:  Tupaki Desk   |   7 Dec 2018 1:30 AM GMT
అది నా పర్సనల్‌, చచ్చే వరకు షేర్‌ చేయను
X
‘ఉయ్యాల జంపాల’ చిత్రం తో తెలుగు ప్రేక్షకుల కు పరిచయం అయిన రాజ్‌ తరుణ్‌ ఆ తర్వాత వరుస గా మంచి సక్సెస్‌ లను తన ఖాతాలో వేసుకున్నాడు. కాని ఈమద్య కాలంలో ఈయన సినిమాలు ఆడలేక పోయాయి. దాంతో ఈయన సినిమాలకు చిన్న గ్యాప్‌ తీసుకున్నాడు. మంచి కథ తో త్వరలోనే వస్తానంటూ చెబుతున్న రాజ్‌ తరుణ్‌ కు మంచి ఆఫర్‌ లు రావడం లేదనే టాక్‌ కూడా వినిపిస్తుంది. తాజా గా రాజ్‌ తరుణ్‌ అభిమానులతో సోషల్‌ మీడియా సైట్‌ ట్విట్టర్‌ లో ఇంట్రాక్ట్‌ అయ్యాడు. ఆ సందర్బం గా పలు విషయాల పై స్పందించాడు.

పెళ్లి గురించి ఒక అభిమాని ప్రశ్నించిన సమయంలో వచ్చే ఏడాది ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అంటూ క్లీయర్‌ గా చెప్పేశాడు. ఇంత క్లారిటీగా చెప్పాడు కనుక లవ్‌ ఏమైనా ఉందా అంటూ చాలా మంది ప్రశ్నించారు. కాని అందుకు రాజ్‌ తరుణ్‌ నుండి సమాధానం రాలేదు. ఇక మరో నెటిజన్‌ మీరు మహేష్‌ బాబు తో ఒక ఫొటో దిగి పోస్ట్‌ చేయవచ్చు కదా అంటూ కోరాడు. అందుకు రాజ్‌ తరుణ్‌ స్పందిస్తూ తాను మహేష్‌ బాబు గారి తో ఫొటో దిగాను. అయితే ఆ ఫొటోను నేను షేర్‌ చేయాలని భావించడం లేదు. చచ్చే వరకు కూడా ఆ ఫొటో నాతో నే ఉంటుంది, ఎవరికి షేర్‌ చేయడం కాని, పోస్ట్‌ చేయడం కాని చేయను అన్నాడు.

ఇక రాజ్‌ తరుణ్‌ ట్విట్టర్‌ డీపీ చాలా సంవత్సరాలుగా అదే ఉంటుంది. ఆ విషయమై మీ ప్రొఫైల్‌ డీపీ మార్చితే బాగుంటుందేమో అంటూ ఒక నెటిజన్‌ సలహా ఇవ్వగా.. దాన్ని సినిమాటో గ్రాఫర్‌ రత్నవేల్‌ గారు తీశారు. నేను దాన్ని ఎప్పటికి మార్చాలనుకోవడం లేదు. ఆ ఫొటో అంటే నాకు ఇష్టం అంటూ రాజ్‌ తరుణ్‌ చెప్పుకొచ్చాడు. ఇంకా పలు విషయాల పై తనదైన శైలిలో రాజ్‌ తరుణ్‌ స్పందించాడు.