Begin typing your search above and press return to search.
రాజ్ తరుణ్.. ఆ రేంజికి ఎదిగిపోయాడా?
By: Tupaki Desk | 23 Dec 2015 1:30 PM GMTతెలుగు సినిమాల్లోనే కాదు.. ఏ ఇండస్ట్రీలో అయినా ఓ సినిమాకు వాయిస్ ఓవర్ చెప్పాలంటే ఓ రేంజ్ ఉండాలి. ‘రుద్రమదేవి’కి చిరంజీవి.. ‘జల్సా’కు మహేష్ బాబు.. ‘పటాస్’కు ఎన్టీఆర్.. ఇలా పెద్ద పెద్ద వాళ్లే వాయిస్ ఓవర్ ఇస్తుంటారు మన సినిమాలకు. అంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఆ హీరోకు ఓ రేంజ్ ఉండాలన్నమాట. కానీ రాజ్ తరుణ్ మాత్రం కేవలం మూడు సినిమాల అనుభవంతోనే వాయిస్ ఓవర్ ఇచ్చే స్థాయికి ఎదిగిపోయాడు. ఈ హ్యాట్రిక్ హీరో జనవరి 1న విడుదల కాబోతున్న ‘అబ్బాయితో అమ్మాయి’కి వాయిస్ ఓవర్ ఇస్తుండటం విశేషం.
ముందుగా అయితే ఈ వాయిస్ ఓవర్ ఆలోచనేమీ లేదట డైరెక్టర్ రమేష్ వర్మకు. ఐతే ఇటీవలే ‘కుమారి 21 ఎఫ్’తో హ్యాట్రిక్ హిట్టు కొట్టి.. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుని.. ‘కోటి రూపాయల హీరో’గా ఎదిగిన రాజ్ తరుణ్ తో వాయిస్ ఓవర్ ఇప్పిస్తే కొంచెం వెరైటీగా ఉంటుందని.. సినిమాకు హెల్ప్ అవుతుందని భావించి అతడితో ఆ పని చేయిస్తున్నాడట. నాగశౌర్య, పాలక్ లల్వాని జంటగా నటించిన ఈ సినిమా రమేష్ వర్మ కెరీర్ కు చాలా కీలకం. ‘వీర’ లాంటి డిజాస్టర్ తర్వాత తనేంటో రుజువు చేసుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు రమేష్ వర్మ. నలుగురు కొత్త నిర్మాతలు అతడి మీద నమ్మకంతో పెట్టుబడి పెట్టారు. క్రిస్మస్ కే విడుదల కావాల్సిన ఈ సినిమా పోటీ ఎక్కువగా ఉండటంతో జనవరి 1కి వాయిదా పడింది.