Begin typing your search above and press return to search.
ఐశ్వర్య సినిమాకు ఆల్ క్లియర్!!!
By: Tupaki Desk | 22 Oct 2016 8:30 AM GMTపాకిస్తాన్ నటులు ఉన్న యే దిల్ హై ముష్కిల్ మూవీని రిలీజ్ కానివ్వబోమంటూ మహరాష్ట్ర నవనిర్మాణ సేన జారీ చేసిన అల్టిమేటం.. చాలానే పెద్ద రచ్చకు కారణమైంది. కరణ్ జోహార్ డైరెక్షన్ లో రణబీర్ కపూర్- ఐశ్వర్యారాయ్- అనుష్క శర్మలు నటించిన ఈ చిత్రంపై అంచనాలు చాలానే ఉన్నా.. ఏకంగా రిలీజ్ కావడమే సందిగ్ధంలో పడ్డంతో బోలెడంత టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా ఐష్ రొమాంటిక్ యాంగిల్ దాదాపు అందరూ మిస్సయినట్లే అనుకున్నారు.
దీపావళి కానుకగా అక్టోబర్ 28న విడుదల చేయాలని తలపెట్టగా.. ఎంఎన్ ఎస్ హెచ్చరిల తర్వాత.. రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా చాలానే ప్రయత్నాలు చేశాడు కరణ్ జోహార్. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడ్డంతో ఎంఎన్ ఎస్ చీఫ్ రాజ్ థాకరే.. మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి యే దిల్ హై ముష్కిల్ నిర్మాతలు భేటీ నిర్వహించారు. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ కు అడ్డు పడబోమంటూ ప్రకటించారు రాజ్ థాకరే.
కానీ పాకిస్తాన్ నటులు ఉన్న ఏ సినిమా అయినా సరే రిలీజ్ కు తాము సహకరించాలంటే.. ఆ చిత్ర నిర్మాతలు 5 కోట్ల రూపాయలను ఆర్మీ రిలీఫ్ ఫండ్ కు విరాళం ఇవ్వాల్సి ఉందంటూ తీర్మానించేశారు. బడా నిర్మాత అయిన కరణ్ జోహార్ ఇందుకు అంగీకరించడంతోనే.. యే దిల్ హై ముష్కిల్ కు అడ్డంకులు తొలగాయి. అలాగే ఫ్యూచర్లో కూడా పాక్ నటులను బాలీవుడ్ సినిమాల్లోకి తీసుకోబమని ఒక లెటర్ రాసిమ్మని కోరారు కూడా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/