Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ: రాజా చెయ్యి వేస్తే
By: Tupaki Desk | 29 April 2016 10:47 AM GMT చిత్రం: రాజా చెయ్యి వేస్తే
నటీనటులు: నారా రోహిత్ - తారకరత్న - ఇషా తల్వార్ - అవసరాల శ్రీనివాస్ - రాజీవ్ కనకాల - శివాజీ రాజా - రవి వర్మ - శశాంక్ తదితరులు
సంగీతం: సాయికార్తీక్
ఛాయాగ్రహణం: భాస్కర్ సామల
నిర్మాత: రజినీ కొర్రపాటి
రచన-దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి
నారా రోహిత్-నందమూరి తారకరత్న కాంబినేషన్.. సాయి కొర్రపాటి లాంటి అభిరుచి ఉన్న ప్రొడ్యూసర్ నిర్మించిన సినిమా.. ఆసక్తికర ట్రైలర్.. మొత్తంగా ‘రాజా చెయ్యి వేస్తే’ మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆ అంచనాలే ఏమేరకు అందుకుందో చూద్దాం పదండి.
కథ:
రాజారాం (నారా రోహిత్) డైరెక్టర్ కావాలన్న లక్ష్యంతో ఉన్న కుర్రాడు. అతను ఛైత్ర (ఇషా తల్వార్) అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను ప్రేమిస్తాడు. ఆమె కూడా తన ప్రేమను ఒప్పుకుంటుంది. తన గర్ల్ ఫ్రెండ్ తో హ్యాపీగా గడిపేస్తూ.. తన లక్ష్యం దిశగా అడుగులేస్తున్న రాజారాంకు పేరుమోసిన క్రిమినల్ అయిన మాణిక్ (తారకరత్న)ను చంపాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకు కారణమేటి? మాణిక్ లాంటి పెద్ద క్రిమినల్ ను సామాన్యుడైన రాజారాం ఎలా ఎదుర్కొన్నాడు..? చివరికి అతణ్ని చంపాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
హీరో ఒక అసిస్టెంట్ డైరెక్టర్.. రొటీన్ కు భిన్నమైన పాత్రే. హీరోకి.. విలన్ కి వైరం అంటూ ఏమీ ఉండదు. కానీ వేరొకరు పన్నిన వలలో చిక్కుకుని విలన్ని చంపాల్సి వస్తుంది. ఇది కూడా భిన్నంగా అనిపించే పాయింటే. హీరో-విలన్ క్లైమాక్స్ లో మాత్రమే ఫేస్ టు ఫేస్ తలపడతారు. మిగతా రెండు గంటల్లో వాళ్లిద్దరికీ క్లాష్ అన్నదే ఉండదు. ఇది కూడా వెరైటీగా అనిపించే పాయింటే. బహుశా ఇక్కడే హీరో నారా రోహిత్.. నిర్మాత సాయి కొర్రపాటి.. కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి చెప్పిన పాయింటుకి ఫ్లాట్ అయిపోయి ఉండొచ్చు.
‘రాజా చెయ్యి వేస్తే’ ఔట్ లైన్ చూస్తే మామూలు రివెంజ్ స్టోరీనే అయినా.. దాన్ని భిన్నమైన స్క్రీన్ ప్లేతో కొత్తగా చెప్పడానికి ట్రై చేశాడు ప్రదీప్ చిలుకూరి. పాత్రల పరిచయం దగ్గర్నుంచి బోలెడన్ని ట్విస్టులుండేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడతను. హీరోతో కాకుండా విలన్ పాత్రతో కథను మొదలుపెట్టి కథనాన్ని కొత్తగా నడిపించాడు. తారకరత్న పాత్ర పరిచయం దగ్గర్నుంచి ఆసక్తి రేపుతుంది. విలన్ అత్యంత క్రూరుడైతే.. హీరో అమాయకుడైన అసిస్టెంట్ డైరెక్టర్.. వీళ్లిద్దరి మధ్య క్లాష్ ఎప్పుడు ఎలా మొదలవుతుందా అన్న క్యూరియాసిటీ ప్రేక్షకుడిలో కలుగుతుంది. ఐతే దానికి బాగా టైం తీసుకున్నాడు దర్శకుడు.
మధ్యలో ఎంటర్టైన్మెంట్ కోసం హీరో-హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ కు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ప్లేస్ చేశాడు. అది కొంచెం ఎక్కువసేపు సాగుతుంది. ఆ ఎపిసోడ్లో కొన్ని చోట్ల కామెడీ పండినప్పటికీ.. ఈ ట్రాక్ మరీ ఎక్కువ సమయం సాగడం వల్ల ప్రేక్షకులు బోర్ ఫీలవుతారు. ఐతే ఫ్లాష్ బ్యాక్ ముగిశాక ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్టు ద్వితీయార్ధం మీద ఆసక్తి రేపుతుంది. కథనం మళ్లీ అక్కడే ట్రాక్ ఎక్కుతుంది. ద్వితీయార్ధమంతా కూడా ఇలాగే ట్విస్టుల మీద ట్విస్టులిస్తూ కథనాన్ని నడిపించాడు దర్శకుడు.
ఐతే మధ్యలో హీరోయిన్ పాత్రకు సంబంధించిన ట్విస్టు వచ్చాక కథనం దారి తప్పింది. హీరోయిన్ రివెంజ్ తాలూకు ఫ్లాష్ బ్యాక్ ను సరిగా డీల్ చేయలేదు. దీనికి సంబంధించిన సన్నివేశాలు సాగతీతలా అనిపిస్తాయి. కొంచెం వైవిధ్యంగా ఉంటుందని.. ‘రివెంజ్’ హీరో పాత్రకు కాకుండా.. హీరోయిన్ క్యారెక్టర్ కి మళ్లించినట్లున్నాడు దర్శకుడు. ఐతే రివెంజ్ హీరోది కానపుడు ప్రేక్షకుడిలో అంత ఎమోషన్ రాదు. పైగా ఓ అసిస్టెంట్ డైరెక్టర్ మంచి క్రైమ్ కథ రాసుకుని.. దాన్ని చక్కగా నరేట్ చేసినంత మాత్రాన.. అతను విలన్ని చంపేయగల సమర్థుడని భావించి.. అతడికి ఆ టాస్క్ టాస్క్ అప్పగించడం అన్నది అసహజంగా అనిపిస్తుంది.
మధ్యలో ఓ అరగంట దారితప్పిన కథనం.. హీరో పాత్రలో మార్పు వచ్చి.. అతను విలన్ని దెబ్బ తీయడానికి సిద్ధపడ్డాక మళ్లీ ట్రాక్ ఎక్కుతుంది. విలన్ని ఫస్ట్ టైం హీరో మార్క్ చేసే దగ్గర్నుంచి క్లైమాక్స్ వరకు ఆసక్తికరంగా సాగుతుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు ఆసక్తి రేకెత్తిస్తాయి. క్లైమాక్స్ బాగుంది. హీరో పాత్ర ప్యాసివ్ గా ఉన్నంత వరకు మామూలుగా అనిపించే సినిమా.. ఆ పాత్ర యాక్టివ్ అయ్యాక ఊపందుకుంటుంది. తారకరత్న పాత్ర మరింత బలంగా ఉండాల్సింది కానీ.. సినిమాకు అది ఆకర్షణగానే నిలిచింది. నిడివి ఎక్కువ కావడం సినిమాకు మైనస్.
నటీనటులు:
ఒకప్పుడు సీరియస్ క్యారెక్టర్లే చేసిన రోహిత్.. ఈ మధ్య కొంచెం కొంటెతనం కూడా మిక్సయిన పాత్రలు ఎంచుకుంటున్నాడు. ‘రాజా చెయ్యి వేస్తే’లో కూడా అతడి పాత్ర అలాగే సాగుతుంది. సీరియస్ గా సాగే సన్నివేశాల్లో ఎప్పట్లాగే బాగా చేసిన రోహిత్.. రొమాంటిక్ సీన్స్ లోనూ పర్వాలేదనిపించాడు. చివరి అరగంటలో అతడి అభినయం ఆకట్టుకుంటుంది. ఐతే ఫిజిక్ విషయంలో మాత్రం రోహిత్ జాగ్రత్త పడాల్సిందే. విలన్ గా తారకరత్న స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. లుక్ కూడా ఆకట్టుకుంది. మాణిక్ పాత్ర అతడికి కచ్చితంగా మేకోవరే అని చెప్పాలి. అతడి నటన ఓకే. మున్ముందు ఇలాంటి పాత్రలు మరిన్ని పడితే తారకరత్న తన ప్రత్యేకత చాటుకునే అవకాశముంది. హీరోయిన్ ఇషా తల్వార్ క్యూట్ గా అనిపిస్తుంది. నటనలో మాత్రం నిరాశ పరిచింది. కీలకమైన సన్నివేశాల్లో ఆమె తేలిపోయింది. అవసరాల శ్రీనివాస్ బాగా చేశాడు. శివాజీ రాజా.. శశాంక్ పాత్రలకు తగ్గట్లుగా నటించారు.
సాంకేతికవర్గం:
తన 50వ సినిమా కోసం సాయికార్తీక్ మంచి ఔట్ పుటే ఇచ్చాడు. అతడి పాటలు బాగున్నాయి. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే డ్యూయెట్.. శ్రీరామనవమి పాట వినసొంపుగా ఉన్నాయి. ఐతే పాటలు సినిమాలో అవసరానికి మించి ఉన్నాయి. ఒకట్రెండు పాటలు కథనానికి అడ్డు పడ్డాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ.. కొన్ని చోట్ల మరీ లౌడ్ నెస్ ఎక్కువైపోయింది. ముఖ్యంగా తారకరత్న కనిపించినపుడల్లా చెవుల తుప్పు వదిలిపోతుంది. భాస్కర్ సామల ఛాయాగ్రహణం ఓకే. ఎడిటింగ్ విషయంలో జాగ్రత్త పడాల్సింది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో ఓ పావు గంట అయినా కోత వేయాల్సింది. సాయి కొర్రపాటి ప్రొడక్షన్ కాబట్టి నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ప్రదీప్ చిలుకూరి తానొక భిన్నమైన దర్శకుడినని చాటుకునే ప్రయత్నం చేశాడు. కథ విషయంలో అతను మరింత కసరత్తు చయాల్సింది. అతనే సొంతంగా రాసిన మాటలు బాగున్నాయి. స్క్రీన్ ప్లే భిన్నంగానే రాసుకున్నాడు కానీ.. కొన్ని చోట్ల క్లారిటీ మిస్సయింది. అనుభవం మీద అతను మరింత మెరుగయ్యే అవకాశముంది. ఓవరాల్ గా ప్రదీప్ ఓకే అనిపించుకున్నాడు.
చివరగా: రాజా చెయ్యి వేస్తే.. ఒక్కసారికి ఓకే
రేటింగ్: 2.75/5
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre