Begin typing your search above and press return to search.
బ్రహ్మి మాట మరిచిపోనంటున్న కొడుకు
By: Tupaki Desk | 13 Aug 2018 10:28 AM GMTబ్రహ్మానందం నట వారసత్వాన్నందుకుని సినీ రంగంలో అడుగు పెట్టాడు గౌతమ్. ఐతే ఇప్పటికే మూడు సినిమాల్లో నటించిన గౌతమ్ కు విజయం వరించలేదు. చివరగా ‘బసంతి’ అనే సినిమాలో నటించాడతను. ఆ చిత్రాన్ని బ్రహ్మి దగ్గరుండి ప్రమోట్ చేశాడు. సినీ ప్రముఖుల సహకారం కూడా తీసుకున్నాడు. కానీ ఆ చిత్రమూ నిరాశనే మిగిల్చింది. దీని తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న గౌతమ్.. ‘మధురం’ అనే షార్ట్ ఫిలింతో సత్తా చాటుకున్న ఫణీంద్ర నరిశెట్టి దర్శకత్వంలో ‘మను’ అనే సినిమా చేశాడు. ఈ చిత్రం సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ అయింది. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. అసలు ఫలితం సంగతలా వదిలేస్తే ఇలాంటి సినిమాలో నటించడమే తన అదృష్టమని అతనన్నాడు.
మూడేళ్ల కిందట ఒక ఫ్రెండు చెబితే ‘మధురం’ షార్ట్ ఫిలిం చూశానని.. చాలా ఇంప్రెస్ అయ్యానని.. ఆ తర్వాత ఫణీంద్రను కలిసి అభినందించానని.. ఈ క్రమంలోనే తామిద్దరం సినిమాల విషయంలో పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నామని.. కొన్ని రోజుల తర్వాత తనకు ఫణీంద్ర ‘మను’ నుంచి 15 నిమిషాల ఎపిసోడ్ ఒకటి చెప్పాడని.. అది అదిరిపోయిందని.. కానీ అతను ఆ కథను తన కోసం చెప్పాడని అనుకోలేదని.. ఫణీంద్ర చెప్పిన ఆ ఎపిసోడ్ గురించి తన సన్నిహితులందరి దగ్గరా చెప్పానని.. కొన్ని రోజుల తర్వాత ‘మను పాత్ర మీరే చేస్తున్నారు’ అంటూ ఫణీంద్ర తనకు మెసేజ్ చేశాడని.. ఆ రోజును తానెప్పటికీ మరిచిపోలేనని.. ఒక నటుడు తనకు సవాలు విసిరే పాత్ర వచ్చినపుడు అత్యంత ఆనందిస్తాడని.. తాను కూడా ఆ రోజు అలాగే ఫీలయ్యానని గౌతమ్ తెలిపాడు. సినీ రంగంలోకి వచ్చేటపుడు తన తండ్రి ఒక మాట చెప్పాడని.. ఏ పని చేసినా రక్తమాంసాలు ధారబోసి పని చేయాలని అన్నాడని.. తాను ఎప్పటికీ ఆ మాట మరిచిపోనని.. ‘మను’ సినిమా కోసం కూడా అలాగే కష్టపడ్డానని.. ఈ చిత్రానికి క్రౌడ్ ఫండింగ్ ద్వారా బడ్జెట్ సమకూరడం చూశాక తన తండ్రి మాటలు మరింతగా గుర్తుకొచ్చాయని అతనన్నాడు.