Begin typing your search above and press return to search.
కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ గా 'రాజ రాజ చోర'
By: Tupaki Desk | 27 Aug 2021 7:00 AM GMTటాలెంటెడ్ యాక్టర్ శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ''రాజ రాజ చోర''. హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. అశేష ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు. ప్రస్తుతానికి కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన చిత్రాల్లో పాజిటివ్ రివ్యూస్ తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం ఇదొక్కటే అని చెప్పవచ్చు. మంచి సినిమా అనే మౌత్ టాక్ రావడంతో ఆడియన్స్ కరోనా ని కూడా కేర్ చేయకుండా ఈ చోరుడి కోసం సినిమా హాళ్లకు వెళ్లారు.
ఈ నేపథ్యంలో ''రాజ రాజ చోర'' చిత్రం ఫస్ట్ వీక్ లో మంచి కలెక్షన్స్ రాబట్టి సక్సెస్ ఫుల్ గా రెండో వారంలోకి అడుగుపెట్టింది. మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 10 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. కోవిడ్ పరిస్థితుల్లో.. ఆంధ్రప్రదేశ్ లో యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లలోకి వచ్చిన శ్రీవిష్ణు సినిమా.. ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టిందంటే ఇది కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పాలి. రాబోయే రోజుల్లో ఈ చిత్రం మరిన్ని వసూళ్లను చోరీ చేస్తుందో చూడాలి.
'రాజ రాజ చోర' సినిమా విజయం టాలీవుడ్ బాక్సాఫీస్ కు నూతనోత్సాహం ఇచ్చిందనే చెప్పాలి. ఈ ఊపులో మరికొన్ని క్రేజీ మూవీస్ థియేటర్ల బాట పట్టే అవకాశం ఉంది. కాగా, 'రాజ రాజ చోర' చిత్రంలో మేఘా ఆకాశ్ హీరోయిన్ గా నటించగా.. సునయన కీలక పాత్ర పోషించింది. తనికెళ్ళ భరణి - రవిబాబు - కాదంబరి కిరణ్ - శ్రీకాంత్ అయ్యంగార్ - అజయ్ ఘోష్ - వాసు ఇంటూరి - గంగవ్వ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రాన్ని టి.జి. విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. వివేక్ సాగర్ దీనికి సంగీతం సమకూర్చగా.. వేదరామన్ సినిమాటోగ్రఫీ అందించారు. విప్లవ్ నిషాదం ఎడిటర్ గా.. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.