Begin typing your search above and press return to search.

ట్విట్ట‌ర్ రివ్యూ: రాజ రాజ చోర‌.. నిజంగానే దోచాడ‌ని ఓవ‌ర్సీస్ రిపోర్ట్

By:  Tupaki Desk   |   19 Aug 2021 5:01 AM GMT
ట్విట్ట‌ర్ రివ్యూ: రాజ రాజ చోర‌.. నిజంగానే దోచాడ‌ని ఓవ‌ర్సీస్ రిపోర్ట్
X
నేటిత‌రంలో విల‌క్ష‌ణ‌ న‌ట‌న‌.. చురుకైన వ్య‌క్తిత్వంతో హీరోగా దూసుకుపోతున్నాడు శ్రీ‌విష్ణు. అత‌డి ఎంపిక‌లే అత‌డిని నిల‌బెడుతున్నాయంటే అతిశ‌యోక్తి కాదు. ఎంచుకునే క‌థ‌.. కంటెంట్ ద‌ర్శ‌కుడు బ్యాన‌ర్ ఇలా ప్ర‌తిదీ అత‌డికి ప్లస్ అవుతున్నాయి. ప్ర‌తిసారీ ఏదో ఒక కొత్త‌ద‌నాన్ని తెలుగు ఆడియెన్ కి ఇవ్వాల‌ని త‌పించ‌డం శ్రీ‌విష్ణుకి క‌లిసొస్తోంది. ప‌రిమిత బ‌డ్జెట్లో క్వాలిటీ కంటెంట్ ని అందించ‌డం అత‌డి ప్ర‌త్యేక‌త‌. ఏదేమైనా సినీనేపథ్యం లేకుండా కేవ‌లం ప్ర‌తిభ‌తో స్టార్ డ‌మ్ పెంచుకుంటున్న హీరోగా శ్రీ‌విష్ణు పేరు మార్మోగుతోంది.

ఇంత‌కుముందు అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు-బ్రోచేవారెవ‌రురా లాంటి వైవిధ్య‌మైన సినిమాల‌తో విజ‌యాలు అందుకున్నాడు. ముఖ్యంగా న‌టుడిగా త‌న‌లోని వైవిధ్యాన్ని ప్ర‌ద‌ర్శించి అభిమానుల్ని పెంచుకున్నాడు. స్టార్ ఇమేజ్ తో ప‌ని లేకుండా అన్ని వ‌ర్గాల ఆడియెన్ ని మెప్పించే స్టార్ గా అత‌డు రూపాంత‌రం చెంద‌డం పెద్ద ప్ల‌స్.

నేడు (19ఆగ‌స్టు) శ్రీ‌విష్ణు న‌టించిన `రాజ రాజ చోర` ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి రిలీజైంది. నైజాంలో 400 థియేట‌ర్లు.. ఏపీలో 200 థియేట‌ర్ల‌లో ఈ సినిమా విడుద‌ల‌వుతోంది. అలాగే అమెరికా స‌హా ఓవ‌ర్సీస్ లో 100 పైగా స్క్రీన్ల‌లో విడుద‌లైంది. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్ లో ప్రీమియ‌ర్ల నుంచి ట్విట్ట‌ర్ రివ్యూల‌తో రిపోర్ట్ అందింది. రాజ రాజ చోర శ్రీ‌విష్ణు బ్రాండ్ సినిమా. ఇందులో కామెడీకి కామెడీ ఎమోష‌న్ అద్భుతంగా పండాయ‌న్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ప్ర‌థ‌మార్థం ఆద్యంతం శ్రీ‌విష్ణు అద్భుత‌మైన కామెడీని పండించాడు. ద్వితీయార్థంలో ఎమోష‌న్స్ ని అంతే బాగా క్యారీ చేశాడు. ఓవ‌రాల్ గా సినిమా హిట్టు బొమ్మ అన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రానికి తొలి చిత్ర ద‌ర్శ‌కుడు అసిత్ గోళి ప‌నిత‌నం ప్ర‌భావ‌వంతంగా క‌నిపించింద‌ని సాంకేతికంగానూ చ‌క్క‌గా తెర‌కెక్కించార‌ని రివ్యూలొచ్చాయి.

ఇంత‌కుముందు ప్ర‌మోష‌న్స్ లో ఈ సినిమాకి వెళ్లిన ఆడియెన్ ప్ర‌థ‌మార్థంలో క‌డుపుబ్బా న‌వ్వుకుని ద్వితీయార్థం ముగింపులో ఎమోష‌న్ తో బ‌య‌ట‌కు వ‌స్తార‌ని శ్రీ‌విష్ణు అన్నారు. అత‌డు చెప్పిన విధంగానే ఈ సినిమా ఉంది అంటూ మినీ రివ్యూల్లో వెల్ల‌డైంది. వివేక్ సాగ‌ర్ సంగీతం.. క‌థానాయిక‌లు మేఘ‌- సున‌య‌న న‌ట‌న .. ర‌విబాబు పెర్ఫామెన్స్ అల‌రించాయ‌ని రివ్యూలొచ్చాయి. కాసేప‌ట్లో రాజ రాజ చోర పూర్తి రివ్యూ కోసం `తుపాకి మూవీ రివ్యూస్`ని అనుస‌రించండి.