Begin typing your search above and press return to search.
'రాజ రాజ చోర' రాబోయే చిత్రాలకు కాన్ఫిడెన్స్ ఇస్తుందా..
By: Tupaki Desk | 21 Aug 2021 8:55 AM GMTకరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల తర్వాత థియేటర్లలోకి వచ్చిన సినిమాలలో శ్రీ విష్ణు ''రాజ రాజ చోర'' పాజిటివ్ రివ్యూస్ తో అందరి ప్రశంసలు అందుకుంది. ఆగస్ట్ 19 గురువారం విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుంచే మంచి టాక్ తో నడుస్తోంది. శుక్రవారం వరలక్ష్మి వ్రతం హాలిడే కలిసొస్తుంది కాబట్టి.. లాంగ్ వీకెండ్ లో కలెక్షన్స్ కొల్లగొట్టాలని చోరుడు ప్లాన్ చేసుకున్నాడు. దీంతో పాటు 'కనబడుటలేదు' 'క్రేజీ అంకుల్స్' 'బజార్ రౌడి' వంటి చిత్రాలు కూడా శ్రావణ శుక్రవారం పై ఆశలు పెట్టుకున్నారు.
అయితే టాలీవుడ్ కు ఈసారి వరలక్ష్మీ దేవి కరుణ పెద్దగా లేదని తెలుస్తోంది. ఈ శుక్రవారం వరలక్ష్మీ దేవి వ్రతం పండుగ కావడంతో కలిసి వస్తుందనుకున్న సెలవు కాస్తా బెడిసి కొట్టింది. జనాలు దేవతలకు పూజలు చేసుకుంటూ.. సినిమా కోసం థియేటర్లకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపలేదని ట్రేడ్ వర్గాలు అంటున్నారు. హిట్ టాక్ తెచ్చుకున్న 'రాజ రాజ చోర' సినిమాకు కూడా రిలీజ్ రోజు కలెక్షన్లతో పోలిస్తే తక్కువే వచ్చాయట. ఇక మిగతా సినిమాలు గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. చాలా ఏరియాల్లో షోలు కూడా కాన్సిల్ అయ్యాయని తెలుస్తోంది.
కాకపోతే 'రాజ రాజ చోర' మూవీ ఈరోజు శనివారం మళ్ళీ పుంజుకుంది. వీకెండ్ కావడంతో చాలా చోట్ల థియేటర్స్ ఫుల్ అయ్యాయి. మంచి సినిమా అనే మౌత్ టాక్ రావడంతో ప్రేక్షకులు కరోనా ని కేర్ చేయకుండా సినిమా హాళ్లకు వెళ్తున్నారు. మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడ్ పెంచి.. పాజిటివ్ టాక్ ని కలెక్టన్స్ గా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వారాంతంలో శ్రీవిష్ణు మూవీ రాబట్టే వసూళ్ళు.. రాబోయే సినిమాలకు ఆక్సిజన్ లా పనికొస్తుందని చెప్పవచ్చు.
'రాజ రాజ చోర' సినిమా జనాలను థియేటర్లకు రప్పిస్తుంది కాబట్టి.. కంటెంట్ బాగుంటే ఆదరిస్తారనే నమ్మకం మిగతా ఫిలిం మేకర్స్ లో కలుగుతోంది. ఈ లాంగ్ వీకెండ్ లో బాక్సాఫీస్ వద్ద శ్రీవిష్ణు మరిన్ని వసూళ్ళు రాబట్టగలిగితే.. వచ్చే వారం థియేటర్లలోకి వచ్చే చిత్రాలను ఇది కాన్ఫిడెన్స్ ఇచ్చే అంశం అవుతుంది. సుధీర్ బాబు 'శ్రీదేవి సోడా సెంటర్' - సుశాంత్ 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' వంటి సినిమాలు ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇవి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే థియేటర్ బిజినెస్ పుంజుకోడంలో సహాయ పడతాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో 'రాజ రాజ చోర' ఏ స్థాయిలో వసూళ్లు కొల్లగొడతాడో చూడాలి.