Begin typing your search above and press return to search.
'చిరంజీవి సాయం వల్లనే ఆరోజు హేమ బ్రతికింది.. లేకపోతే చనిపోయేది'
By: Tupaki Desk | 21 Aug 2021 11:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి ని సినీ అభిమానులు ఎంతగా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన సేవాగుణంతో రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా చిరు హీరో అనిపించుకున్నారు. బ్లడ్ బ్యాంక్ - ఐ బ్యాంక్ లను స్థాపించి ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్న చిరంజీవి.. మరెన్నో మంచి పనులు చేసి మహోన్నత శిఖరంగా ఎదిగారు. ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోతున్న వారిని చూసి చలించిన చిరు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. ఆపదలో ఉన్నవారికి ఆపద్భాందవుడిగా మారిన చిరంజీవి.. ఎన్నడూ తన సాయం గురించి బయటకు చెప్పకోరు. ఆయన సహాయం పొందినవారు మాత్రం మెగాస్టార్ మనసు ఎలాంటిదో చెబుతూ ఉంటారు. తాజాగా సీనియర్ నటుడు రాజా రవీంద్ర ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి సేవా కార్యక్రమాల గురించి మాట్లాడారు.
''ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా చిరంజీవి అన్నయ్య దగ్గరకే వెళ్లారు. కోవిడ్ సమయంలో ఒక్క క్షణం ఖాళీ లేకుండా గడిపారు. బ్లడ్ బ్యాంక్ - ఆక్సిజన్ బ్యాంక్ లను నిర్వహిస్తూనే.. మిగతా సినీ ప్రముఖులతో కలిసి సీసీసీ పెట్టి సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేశారు. అందరికీ వ్యాక్సినేషన్ అందేలా చర్యలు తీసుకున్నారు. బ్లడ్ బ్యాంక్ అనేది మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ దాని అవసరం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఎంత మంది ప్రాణాలు కాపాడుతున్నారనే విషయం'' అని రాజా రవీంద్ర అన్నారు.
''హేమ డెలివరీ సమయంలో బ్లడ్ కావాల్సి వచ్చింది. అది దొరక్కపోతే చనిపోతుంది. అర్థరాత్రి రెండు గంటలకు ఆమెకు 'O' నెగెటివ్ బ్లడ్ అవసరం. అది చాలా రేర్ గా దొరుకుతుంది. అప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం తీసుకొస్తే ఆమె బతికింది. అదే బ్లడ్ లేకపోతే ఆమె చనిపోయేది. బ్లడ్ విలువ అవసరంలో ఉన్న వారికే తెలుస్తుంది. బ్లడ్ బ్యాంక్ నడపడం అంత ఈజీ కాదు. అలానే ఐ బ్యాంక్ కూడా. 22 ఏళ్ల నుంచి సేవ చేస్తున్నారు. డబ్బుంటే అయిపోతుంది అని అందరూ అనుకుంటారు. దానికి అన్నయ్య కు నెలకు 15 లక్షలు దాకా ఖర్చు అవుతుంది'' అని చెప్పుకొచ్చారు.
ఇంకా రాజా రవీంద్ర మాట్లాడుతూ.. ''రోజూ ఎంతో మంది ఫ్యాన్స్ కు సహాయం చేస్తుంటారు. ఇటీవల ఓ పెద్ద ఆర్టిస్టుకి ప్రాబ్లమ్ వస్తే చిరంజీవి అన్నయ్య అమౌంట్ ఇస్తే నేను స్వయంగా వెళ్లి వారికి ఇచ్చి వచ్చా. అన్నయ్య ఎవరికీ చెప్పొద్దు అన్నారు. అందుకే ఆ ఆర్టిస్ట్ పేరు చెప్పడం లేదు. ఇలాంటివి ఎన్నో చేస్తారు. కానీ బయటకు చెప్పరు. అది సహాయం తీసుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అందరూ హీరోలు అంత తీసుకుంటారు ఇవ్వొచుగా అనుకుంటారు. కానీ ఇలా సాయం చేసి కూడా చెప్పుకోని వారు ఉంటారు. మనకు దేవుడు ఇచ్చాడు. వీలైనంత వరకూ హెల్ప్ చేద్దాం అంటారు అన్నయ్య. అయినా కొందరు తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. అలా విమర్శించిన వాళ్ళకి కూడా ఆయన హెల్ప్ చేశారు'' అని అన్నారు.