Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: రాజా ది గ్రేట్.. వెరీ యాప్ట్
By: Tupaki Desk | 15 Aug 2017 4:12 AM GMTసర్వేంద్రియానాం నయనం ప్రధానం. కాదు కాదు.. 'సర్వేంద్రియానాం సర్వం ప్రధానం' అంటున్నాడు మాస్ రాజా. చాలా రోజుల తరువాత తన స్టామినాకు తగ్గట్టు ఒక కథను చేసినట్లున్నాడు రవి తేజ. ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదలైన ''రాజా ది గ్రేట్'' టీజర్ ను చూద్దాం పదండి.
అనిల్ రావిపూడి డైరక్షన్లో రూపొందిన ''రాజా ది గ్రేట్'' సినిమాలో రవితేజ పాతికేళ్ళ నుండి కళ్లు కనబడని ఒక అంధ వ్యక్తిగా నటిస్తున్నాడు. ఈ మధ్యనే సేమ్ టు సేమ్ ఇలాంటి ఫార్మాట్లోనే వచ్చిన రాజ్ తరుణ్ 'అంధగాడు' సినిమా వెంటనే గుర్తురావొచ్చుకాని.. ఇక్కడ రవితేజ ఎనర్జీ అండ్ డైలాగ్ డెలివరీ అన్నింటినీ డామినేట్ చేస్తుంది. అన్ని అవయవాల కంటే కళ్ళు ప్రధానం అంటారు కాని.. అవి లేకుండానే పాతికేళ్ళ నుండి బతుకుతున్నాం అంటూ చెప్పే రవితేజ యాటిట్యూడ్ ఈ సినిమా పల్స్ ను మనకు పరిచయం చేస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో కొందరు విలన్స్.. తన ఇంటిలెజెన్స్ తో కేవలం ధ్వనిని విని ఫైటింగులు చేసే హీరో.. అలాగే ఒక ప్రియమైన తల్లి.. ఒక ప్రియురాలు.. అందరూ ఆసక్తికరమైన పాత్రలనే చేశారు.
సినిమా టీజర్ చూస్తుంటే హిందీలో వచ్చిన కాబిల్.. హాలీవుడ్ సినిమా డోంట్ బ్రీత్ గుర్తుకురావొచ్చు కాని.. దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం ఇలాంటి పాత్రతో కమర్షియల్ సినిమాను తీయాలని గొప్ప ప్రయత్నమే చేశాడు. చూస్తుంటే ఈ ఏడాది దిల్ రాజు ఈ సినిమాతో మరో హిట్టు ఖాతాలో వేసుకుంటాడేమో అనిపిస్తోంది. ఈ సినిమాలో రాధిక.. ప్రకాష్ రాజ్.. సంపత్.. మెహ్రీన్ కౌర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.