Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ : రాజా విక్రమార్క
By: Tupaki Desk | 12 Nov 2021 1:07 PM GMT'రాజా విక్రమార్క' మూవీ రివ్యూ
నటీనటులు: కార్తికేయ- తాన్య రవిచంద్రన్-పశుపతి-తనికెళ్ల భరణి-సాయికుమార్-హర్షవర్ధన్-సుధాకర్ కోమాకుల తదితరులు
సంగీతం: ప్రశాంత్ విహారి
ఛాయాగ్రహణం: మౌళి
నిర్మాత: 88 రామారెడ్డి
రచన-దర్శకత్వం: శ్రీ సరిపల్లి
'ఆర్ఎక్స్ 100'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ కథానాయకుడు కార్తికేయ.. దాని తర్వాత ఇప్పటిదాకా సరైన విజయాన్నందుకోలేదు. ఇప్పుడతడి ఆశలన్నీ 'రాజా విక్రమార్క' మీదే నిలిచాయి. ప్రోమోలు చూస్తే కార్తికేయ ఆశల్ని నిలబెట్టే సినిమాలానే కనిపించిందిది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ: విక్రమ్ (కార్తికేయ) నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలో ఆఫీసర్. తన టీంతో కలిసి చేసిన ఒక ఆపరేషన్లో భాగంగా ఒక నేరస్థుడిని పట్టుకుంటే అతను అనుకోకుండా తన చేతుల్లోనే చనిపోతాడు. చనిపోయిన వ్యక్తి దగ్గర మాజీ నక్సలైట్ అయిన గురునారాయణ (పశుపతి) ఆయుధాలు కొన్నాడని.. అతను హోం మంత్రి చక్రవర్తి (సాయికుమార్)పై ఉన్న పాత పగతో తనను టార్గెట్ చేయబోతున్నాడని తెలుస్తుంది. దీంతో హోం మంత్రిని కాపాడే బాధ్యత విక్రమ్ తీసుకుంటాడు. మంత్రి ఇంటిపై రెక్కీ చేసే క్రమంలో ఆయన కూతురితో ప్రేమలో పడతాడు. గురునారాయణ హోం మంత్రిని చంపబోతుంటే విక్రమ్ అడ్డుకోవడమే కాక.. అతణ్ని అరెస్టు చేస్తాడు. కానీ గురునారాయణ ప్లాన్.. హోమంత్రిని చంపడం కాదని.. ఇంకేదో ఉందని విక్రమ్ కు అర్థమవుతుంది. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి.. దాన్ని విక్రమ్ భగ్నం చేశాడా లేదా.. ఈ క్రమంలో జరిగిన పరిణామాలేంటి అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ: రాజా విక్రమార్క సినిమాలో హీరో నిజానికి నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెంట్ అయినా.. ఒక ఆపరేషన్లో భాగంగా హీరోయిన్ దగ్గర ఒక ఎల్ఐసీ ఏజెంట్ లాగా నటిస్తాడు. తర్వాత పరిణామాల్లో హీరో ఎన్ఐఏ ఏజెంట్ అని హీరోయిన్ కు తెలుస్తుంది. తన దగ్గర అబద్ధం చెప్పినందుకు కోపగించుకుని కాసేపటికి కూల్ అయిన హీరోయిన్.. ఏమైనా సరే నువ్వు ఎన్ఐఏ ఏజెంట్ అంటే మాత్రం నాకు అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు అంటుంది. హీరో కోపంగా గన్నులో బుల్లెట్ లోడ్ చేసి ఆమెకు గురి పెట్టి మీ నాన్నని అలా కాపాడినా నమ్మకపోతే ఎలా అని చెప్పి బలవంతంగా ఆమెను ఒప్పిస్తాడు. దాదాపుగా ఈ సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకుల పరిస్థితి కూడా హీరోయిన్ తరహాలోనే ఉంటుంది. ఓటీటీ విప్లవం తర్వాత థ్రిల్లర్ వెబ్ సిరీసుల్లో.. అలాగే కొన్ని సినిమాల్లో ఎన్ఐఏలో పని చేసే వాళ్లు ఎలా ఉంటారో.. వాళ్ల పనితీరు ఎలా ఉంటుందో కాస్తో కూస్తో తెలుసుకున్నాక ఈ సినిమాలో ఎన్ఐఏ టీం అని పేరు పెట్టుకుని హీరో అండ్ కో చేసే గల్లీ విన్యాసాలు చూస్తే చాలా సిల్లీగా అనిపిస్తాయి తప్ప.. ఎక్కడా ఇంటెన్సిటీ అన్న మాటే ఉండదు. సీరియస్ సినిమాలు జనాలు చూడరనుకుంటే.. జనాలకు ఎంటర్టైన్మెంటే ఇవ్వాలనుకుంటే హీరోను ఏ కానిస్టేబుల్ గానో చూపించాలి కానీ.. ఇలా సివిల్స్ పాసై ఎన్ఐఏ ఆఫీసర్ గా చూపించి కామెడీ చేయించడమేంటో అర్థం కాదు. ఈ పాత్రతో మొదలుపెడితే రాజా విక్రమార్క సినిమా నిండా సిల్లీ థింగ్స్.. ఇల్లాజికల్ వ్యవహారాలే కనిపిస్తాయి.
'రాజా విక్రమార్క' గురించి చెబుతూ ఇది నాగార్జున నటించిన 'నిర్ణయం' లాంటి సినిమా అన్నాడు కొత్త దర్శకుడు శ్రీ సరిపల్లి. అంటే అందులో మాదిరే ఇక్కడా హీరో పోలీస్ అధికారి. పైగా ఆ పాత్ర ద్వారా కామెడీ పండించే ప్రయత్నం చేశారు. ఐతే 'నిర్ణయం' సినిమాలో అంత కామెడీ చేయించినా ఎబ్బెట్టుగా అనిపించకపోవడానికి కారణం.. అందులో హీరోను ఒక మామూలు పోలీస్ గా చూపిస్తారు. పైగా పోలీస్ పాత్ర తాలూకు ఇంటెన్సిటీ ఏమీ చూపించకుండా నేరుగా కామెడీతో కథను మొదలుపెడతారు. అన్నింటికీ మించి కామెడీ విషయానికి వస్తే లాజిక్స్ అన్నీ మరిచిపోయి కడుపుబ్బ నవ్వుకునేలా పేలిపోయే కామెడీ సీన్స్ ఉంటాయి. కానీ 'రాజా విక్రమార్క'లో హీరో చిన్నా చితకా పోలీస్ కాదు. సివిల్స్ పాసై ఎన్ఐఏలో పని చేసే ఉన్నతాధికారి. అలాంటి పాత్రలో హీరోను చూపించి.. తనతో హైలెవెల్ ఆపరేషన్లు చేయిస్తూ మధ్య జోకులు వేయిస్తానంటే ఎలా? కరడుగట్టిన క్రిమినల్ పట్టుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న హీరో మధ్యలో తన తిండి తినే హడావుడిలో పడి ట్రిగ్గర్ నొక్కేసి అతణ్ని చంపేసి ఇదే కామెడీ.. నవ్వుకోండి అంటే ఎలా? అసలిక్కడ జెన్యూన్ లాఫ్స్ ఇచ్చే కామెడీ సీన్లేమీ రాయకుండా.. హీరో నాన్ సీరియస్ గా చూపించేసి.. తన బాస్ తో పరాచికాలు ఆడినంత మాత్రాన దాన్నే కామెడీ అనుకుని ఎలా నవ్వేసుకుంటాం? కామెడీ సంగతి పక్కన పెట్టి అసలు కథనైనా సీరియస్ గా నడిపించారా.. థ్రిల్స్ అయినా ఇచ్చారా అంటే అదీ లేదు. గల్లీ రౌడీ లాంటి విలన్ని పెట్టి అతడికి ఎక్కడ లేని బిల్డప్ ఇచ్చి దాని చుట్టూ నడిపిన ప్రహసనం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
హీరో ఎన్ఐఏ ఆఫీసర్.. ఒక క్రిమినల్ ను పట్టుకోవడానికి చేసే ఆపరేషన్ నేపథ్యంలో సినిమా అనగానే అనగానే ఒక థ్రిల్లర్ మూవీ ఆశిస్తాం. ఐతే 'రాజా విక్రమార్క'లో థ్రిల్స్ కంటే కామెడీ మీదే ఎక్కువ ఫోకస్ చేశారు. అలాగని ఆ కామెడీ అయినా సరిగా పండిందా అంటే అదీ లేదు. ఆరంభంలో సెటప్ చూస్తే ఏదో కొత్త సినిమా చూడబోతున్న ఫీలింగ్ కలుగుతుంది కానీ.. ఇది ఎన్నోసార్లు చూసిన రొటీన్ కథే అని అర్థం కావడానికి ఎంతో సమయం పట్టదు. హోం మంత్రికి ఓ మాజీ నక్సలైట్ నుంచి ముప్పని తెలిసి హీరో ఆయన ఇంట్లో రెక్కీకి రెడీ అవగానే 'రాజా విక్రమార్క' వందల సార్లు చూసిన సినిమాల ఫార్మాట్లోకి మారిపోతుంది. హోం మంత్రికో అందమైన కూతురు.. తండ్రి మంత్రి అయినా ఆ అమ్మాయి మాత్రం చాలా సింపుల్.. అది చూసి హీరో ఇంప్రెస్ అయిపోవడం.. ఏదో లింకు పట్టుకుని ఆమెకు దగ్గరైపోవడం.. ఆమెలో ఎమోషనల్ అయిపోయేలా తనకిష్టమైనవి చేసి మనసు దోచేయడం.. ఇలా కాసేపటికే పరమ రొటీన్ సినిమాగా మారిపోతుంది 'రాజా విక్రమార్క'. ప్రేమకథ పూర్తిగా నిరాశ పరిస్తే.. మధ్య మధ్యలో కామెడీ కోసం చేసిన ప్రయత్నాలేవీ కూడా అంతగా ఫలించలేదు. విలన్ ఎంటర్ అయ్యాకైనా సినిమాలో వేగం వస్తుందనుకుంటే.. ఆ పాత్ర ఎంట్రీ దగ్గరే తేలిపోయింది. ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్టు ఇచ్చి ద్వితీయార్ధం మీద కొంచెం ఆసక్తి పెంచారు.
ఐతే ద్వితీయార్ధంలో అయినా 'రాజా విక్రమార్క' థ్రిల్లింగ్ గా సాగుతుందేమో అని చూస్తే ఆ ఆశ నెరవేరదు. హీరోయిన్ కిడ్నాప్ చుట్టూ నడిపిన డ్రామా తలా తోకా లేకుండా సాగుతుంది. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేమ్ సుధాకర్ చేసిన సెక్యూరిటీ అధికారి పాత్రలో విలన్ షేడ్స్ చూపించి థ్రిల్ చేయాలని చూశారు కానీ.. అది కాస్తా కామెడీగా తయారైంది. ఆ పాత్రలో ఏమాత్రం ఇంటెన్సిటీ లేకపోవడం.. దాన్ని పేలవంగా తీర్చిదిద్దడంతో ద్వితీయార్ధం పూర్తిగా చెడిపోయింది. కిడ్నాపర్ల బ్యాచ్ ఉండే డెన్.. వాళ్ల సెటప్.. వాళ్లతో హీరో టీంలో ఒక్కొక్కరు కూరగాయల బేరాలాడినట్లు చర్చలు జరిపే తీరు చూసి వెటకారంగా నవ్వుకోవాలి తప్ప.. నవ్వులకు ఆస్కారమే లేదు ఎక్కడా. ప్రథమార్ధంలో.. చివర్లో హర్షవర్ధన్ కొంత నవ్వులు పంచాడు తప్పితే మిగతా ఎక్కడా ఎంటర్టైన్మెంట్ అన్నదే లేకపోయింది. కిడ్నాప్ డ్రామా విపరీతంగా సాగతీసి ఉన్న కొంచెం ఆసక్తి కూడా పూర్తిగా పోయేలా చేశాడు దర్శకుడు. ప్రి క్లైమాక్స్ లో వచ్చే ఇన్వెస్టిగేటివ్ సీన్ల విషయంలో చాలా కష్టపడ్డట్లు కనిపిస్తుంది కానీ.. అవేవీ సినిమాకు అవసరం అనిపించవు. సినిమా నిడివి పెరగడానికి తప్ప ఎందుకూ అవి కొరగాకుండా పోయాయి. ముందుకు సాగేకొద్దీ ఎంటర్టైన్మెంట్ పూర్తిగా మిస్ అయి... క్లైమాక్సులో సైతం మెరుపులేమీ లేక.. 'రాజా విక్రమార్క' ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారుతుంది. అంతిమంగా రాజా విక్రమార్క ప్రేక్షకులకు ఎలాంటి కొత్త అనుభూతిని ఇవ్వని ఒక రొటీన్ సినిమా అనడంలో మరో మాట లేదు.
నటీనటులు: కార్తికేయ ఒక సినిమాకు ఇంకో సినిమాకు సంబంధం లేకుండా భిన్నమైన పాత్రలే ప్రయత్నిస్తున్నాడు కానీ.. కథల ఎంపికలో మాత్రం తడబడుతున్నాడు. తన ఆహార్యానికి తగ్గ పాత్ర అని.. కామెడీ టచ్ ఉంది కాబట్టి తనకు కొత్తగా ఉంటుందని ట్రై చేసినట్లున్నాడు విక్రమ్ క్యారెక్టర్. అతనా పాత్రలో చూడ్డానికి బాగున్నా.. నటన కూడా ఓకే అనిపించినా.. పాత్రలో విషయం లేక తన శ్రమంతా వృథా అయింది. హీరోయిన్ తాన్య చూడ్డానికి పర్వాలేదు. తన పాత్ర మరీ రొటీన్. తాన్య అందాన్ని ఎలివేట్ చేసే పాటలేవీ ఇందులో లేవు. హీరో బాస్ గా తనికెళ్ల భరణికి కీలకమైన.. ఫుల్ లెంగ్త్ రోల్ దక్కింది. అందులో ఆయన బాగానే ఆకట్టుకున్నారు. తన పాత్రకు సంభాషణలు బాగా కుదిరాయి. సాయికుమార్ పాత్ర తేలిపోయింది. ఆయన లుక్ కూడా బాగా లేదు. తమిళంలో ఎన్నో ఇంటెన్స్ రోల్స్ చేసిన పశుపతిని ఇందులో విలన్ పాత్రకు ఎందుకు తీసుకున్నారో అర్థం కాదు. ఆయన ప్రతిభను ఏమాత్రం ఉపయోగించుకోలేదు. సుధాకర్ కోమాకుల ద్వితీయార్ధంలో కొన్ని చోట్ల మెరిశాడు. హర్షవర్ధన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సినిమాలో బెస్ట్ ఎంటర్టైనర్ అంటే అతనే.
సాంకేతిక వర్గం: సాంకేతిక వర్గం: ప్రశాంత్ విహారి పాటల్లో సమ్మతమే ఒక్కటి పర్వాలేదనిపిస్తుంది. మిగతా పాటలేవీ అస్సలు గుర్తుండవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. పి.సి.మౌళి కెమెరా పనితనం బాగుంది. కొత్త నిర్మాతలైనా ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో రాజీ పడలేదు. కార్తికేయ ట్రాక్ రికార్డు చూడకుండా బాగానే ఖర్చు పెట్టారు. తెరమీద క్వాలిటీ కనిపిస్తుంది. ఐతే కొత్త దర్శకుడు శ్రీ సరిపల్లికి కావాల్సిన వనరులన్నీ అందించినా అతను ఉపయోగించుకోలేకపోయాడు. ఒకప్పుడైతే ఇలాంటి లాజిక్ లేని కథలతో బండి నడిచిపోయేది కానీ.. ఇప్పుడు ఏం చూపించినా రియలిస్టిగ్గా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. స్టార్ హీరోలే ఇలాంటి పాత్రలను చేస్తే కొంచెం స్టడీ చేసి దిగుతున్నారు. ఎన్ఐఏ వాళ్ల పని తీరు.. వాళ్ల ఆపరేషన్లు ఎలా ఉంటాయో గమనించి పాత్రలు.. కథాకథనాలు.. సన్నివేశాలు వాస్తవికంగా ఉండేలా చూసుకుంలటున్నారు. అలాంటిది ఒక యంగ్ హీరోను పెట్టి ఇంత ఆషామాషీ కథాకథనాలతో ఓ కొత్త దర్శకుడు ఇలా సినిమా ఎలా తీసేశాడో అర్థం కాదు. రచయితగా.. దర్శకుడిగా శ్రీ సరిపల్లి ఏమాత్రం మెప్పించలేకపోయాడు. కథ.. పాత్రల దగ్గరే తేలిపోయిన అతను.. కథనంతోనూ మ్యాజిక్ చేయలేకపోయాడు.
చివరగా: రాజా విక్రమార్క.. మిస్ ఫైర్
రేటింగ్-2/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre