Begin typing your search above and press return to search.
రాజమౌళి 'బ్రహ్మాస్త్ర'.. ఇంత మొండిపట్టు ఎందుకంటే?
By: Tupaki Desk | 3 Sep 2022 4:48 AM GMTవరుసగా తెలుగు పాన్ ఇండియా సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో హడావిడి చేస్తూ ఉండడంతో ఇప్పుడు మనం తెలుగు దర్శకులకు మంచి డిమాండ్ అయితే ఏర్పడింది. బాలీవుడ్ హీరోలు కూడా సౌత్ ఇండస్ట్రీలో వారి స్టామినా చూపించేందుకు సిద్ధమవుతున్నారు. బ్రహ్మాస్త్ర సినిమాతో కూడా రణ్ బీర్ కూడా మంచి సక్సెస్ అందుకోవాలని గత ఏడాది నుంచి ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు. ప్రత్యేకంగా తెలుగు పైనే అతను ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండడం విశేషం.
ఎందుకంటే ఇక్కడ 150 కోట్లకు పైగా మార్కెట్ ఉంది కాబట్టి తప్పకుండా ఎంతో కొంత మార్కెట్ క్రియేట్ చేసుకోవచ్చు అని ఆసక్తితో ఉన్నారు. ముందు తెలుగు ఆడియోన్స్ ని మెప్పిస్తే ఆ తర్వాత ఈజీగా తమిళ్ కన్నడ మలయాళం జనాలను కూడా వారి వైపుకు తిప్పుకోవచ్చు అనే ఆలోచన కూడా లేకపోలేదు. ఇక బ్రహ్మాస్త్ర సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ దాదాపు రాజమౌళి తన సినిమా స్టైల్ లోనే నిర్వహించాలని అనుకున్నారు. అందుకోసం తన కొడుకు కార్తికేయను కూడా జక్కన్న రంగంలోకి దింపాడు.
ఒక విధంగా ఆయన ఈ సినిమాకు సమర్పకుడిగా ఉన్నప్పటికీ కరణ్ జోహార్ టీమ్ తలుచుకుంటే ఆ ఈవెంట్ ను గట్టిగానే ప్లాన్ చేస్తారు. కానీ రాజమౌళి ప్రత్యేకంగా బ్రహ్మాస్త్ర ఈవెంట్ నిర్వహించాలని అనుకున్నారు.
కానీ సెక్యూరిటీ కారణాల వలన సినిమా ఈవెంట్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఇక నిన్న నిర్వహించిన ప్రెస్ మీట్ లో రాజమౌళి హడావుడి చూస్తూ ఉంటే తన సినిమాను విడుదలవుతోంది అన్నంతగా మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ రావడానికి కారణం కూడా ఆయనే.
ఒక విధంగా రాజమౌళి ఆ విధంగా ప్రవర్తించడానికి కారణం అయితే ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో RRR, బాహుబలి సినిమాలకు ఎంతగా క్రేజ్ దక్కిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరణ్ జోహార్ బాహుబలి సినిమాను విడుదల చేయలేకపోయి ఉంటే ఒక విధంగా ఆ స్థాయిలో సినిమా జనాలకు రీచ్ అయ్యేది కాదు.
ఆయన పక్కా ప్రణాళికతో హిందీలో మార్కెటింగ్ చేయడం బాగా కలిసి వచ్చింది. ఆ విషయం జక్కన్నకు బాగా తెలుసు. ఇక ఆ రుణం తీర్చుకునేందుకు జక్కన్న ఇప్పుడు ఆయన ప్రొడక్షన్లో వస్తున్న బ్రహ్మాస్త్ర సినిమాను తెలుగులో సక్సెస్ చేయాల్సిన బాధ్యతను తీసుకున్నాడు. బ్రహ్మాస్త్ర సినిమాలను సక్సెస్ చేసి కరణ్ జోహార్ కు కానుకగా ఇవ్వాలి అని మొండిపట్టుతో ఉన్నారు. మరి సెప్టెంబర్ 9 వస్తున్న బ్రహ్మస్త్ర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.