Begin typing your search above and press return to search.

తారక్ మల్టీ ట్యాలెంట్‌ కి ఎవరైనా ఫిదా అవ్వాలి.. అది అంతే!

By:  Tupaki Desk   |   7 Sept 2022 5:00 PM IST
తారక్ మల్టీ ట్యాలెంట్‌ కి ఎవరైనా ఫిదా అవ్వాలి.. అది అంతే!
X
యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ యొక్క డాన్స్ గురించి.. నటన గురించి.. డైలాగ్‌ డెలవరీ గురించి ఆయన యొక్క ప్రవర్తన గురించి ఇంకా ఎన్నో ఎన్నెన్నో విషయాల గురించి ప్రశంసలు దక్కించుకోవడం మనం చూశాం.. విన్నాం.

ఇంకా ఆయన లో అద్భుతమైన కళలు ఉన్నాయని ఆయన్ను దగ్గర నుండి చూసిన వారికి మాత్రమే తెలుసు. ఆ కళ్ళల్లో ఒక కళ.. అదే ప్రతిభ గురించి రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

బాలీవుడ్‌ మూవీ బ్రహ్మాస్త్ర సినిమా ను రాజమౌళి సౌత్ ఇండియాలో సమర్పిస్తున్న విషయం తెల్సిందే. సినిమా కోసం రాజమౌళి చాలా కష్టపడుతున్నాడు. ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన సినిమాల స్థాయిలో బ్రహ్మాస్త్ర సినిమాకి ప్రమోషన్‌ చేస్తూ తనదైన శైలిలో సినిమాకి హైప్‌ తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఆ సందర్భంగా తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి పలు విషయాల గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ గురించిన ఒక ఆసక్తికర విషయాన్ని తెలియజేశాడు. ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌ యొక్క జ్ఞాపక శక్తి గురించి తెలియజేశాడు. తారక్‌ కి ఏదైనా ఇష్టం అయితే దాన్ని ఎంతగా గుర్తు పెట్టుకుంటాడో అనేందుకు ఇది సాక్ష్యం.

ఇంతకు రాజమౌళి చెప్పిన ఆ ఆసక్తికర విషయం ఏంటి అంటే... ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ప్రమోషన్ లో భాగంగా ముంబయిలో ఉన్న సమయంలో రణబీర్‌ కపూర్ ను కలవడం జరిగింది. ఆ సమయంలో రణబీర్ కపూర్‌ నటించిన రాక్ స్టార్‌ పాటలను ఎన్టీఆర్ ప్లే చేయాల్సిందిగా అడిగాడు. అప్పుడు రణబీర్‌ ఆ పాటలను ప్లే చేయించాడు.

రాక్ స్టార్‌ లో నటించిన రణబీర్‌ కపూర్‌ అయినా ఆ పాటల యొక్క లిరిక్స్ ను మర్చి పోయాడేమో కానీ.. ఎన్టీఆర్‌ మాత్రం లైన్ టు లైన్ పాడి అక్కడ ఉన్నవారందరినీ కూడా ఆశ్చర్య పరిచారు. తనకు నచ్చిన దాన్ని ఆయన గుర్తు పెట్టుకునే విధంగా కు అంతా ఆశ్చర్యపోయాం అంటూ రాజమౌళి వ్యాఖ్యలు చేశాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.