Begin typing your search above and press return to search.
80 వెర్షన్ లు.. 18 టేక్ లు.. నాటు నాటు అంత ఈజీగా అవ్వలేదు
By: Tupaki Desk | 11 Jan 2023 6:33 AM GMTమన నాటు నాటు కు అంతర్జాతీయ స్థాయి పురస్కారం గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. కీరవాణి సంగీతానికి.. రాజమౌళి టేకింగ్ తో పాటు ఇద్దరు హీరోల డాన్స్ ఇలా ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా నాటు నాటు ను ఈ స్థాయికి తీసుకు వెళ్లాయి అనడంలో సందేహం లేదు.
ఇప్పుడు నాటు నాటు అవార్డు దక్కించుకుంది కానీ.. ఆ పాట మేకింగ్ కోసం ఎంత కష్టం అయ్యిందో ఆర్ఆర్ఆర్ సినిమా యొక్క ప్రమోషన్ సమయంలో హీరోలు మరియు రాజమౌళి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం యుద్దం జరుగుతున్న ఉక్రెయిన్ లో ఈ పాట ను చిత్రీకరించారు.
పాటలో కనిపించే ప్యాలస్ నిజమైనది.. ఉక్రెయిన్ అధ్యక్షుడి అధికారిక నివాసం. అక్కడ చిత్రీకరణ కు అనుమతులు దక్కించుకుని చిత్రీకరణ కు చాలా కష్టాలు పడ్డామని ఆ సమయంలో రాజమౌళి పేర్కొన్నారు.
ఇక ఈ పాటలోని హుక్ స్టెప్ కోసం కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఏకంగా 80 వర్షన్ లను రికార్డ్ చేశాడని.. చివరకు హీరోలు ఇద్దరు ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని స్టెప్స్ వేయడంను కన్ఫర్మ్ చేయడం జరిగింది.
ఇక ఈ పాటలో ఇద్దరు హీరోలు సింక్ అయ్యేలా స్టెప్స్ చేయడానికి.. మరియు దుమ్ము రావడానికి కూడా టేక్ ల మీద టేక్ లు తీసుకున్నారట. ఇద్దరు హీరోల యొక్క స్టెప్స్ సింక్ అయ్యేలా ఏకంగా 18 టేక్ లను తీసుకున్నట్లుగా ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఆ పాట సమయంలో రాజమౌళి పై కోపం వచ్చిందని కూడా సరదాగా ఎన్టీఆర్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఇలాంటి అవార్డులు వచ్చినప్పుడు అంత కష్టం మర్చిపోయినట్లు అవుతుంది. కష్టానికి ప్రతిఫలం దక్కిందని యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.